మన ఆరోగ్యరంగ బలాన్ని ప్రపంచం గుర్తించింది

దేశ ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం సమగ్ర విధానాలు చేపడుతోందని, కేవలం చికిత్సపైనే కాకుండా సంరక్షణపై కూడా దృష్టిపెట్టిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. 2021-22 కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య కేటాయింపులపై

Published : 23 Feb 2021 22:46 IST

ప్రధాని మోదీ

దిల్లీ: దేశ ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం సమగ్ర విధానాలు చేపడుతోందని, కేవలం చికిత్సపైనే కాకుండా సంరక్షణపై కూడా దృష్టిపెట్టిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. 2021-22 కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య కేటాయింపులపై ప్రధాని నేడు వెబినార్‌లో మాట్లాడారు. ఈ ఏడాది బడ్జెట్‌లో ఆరోగ్యరంగానికి అసాధారణ కేటాయింపులు చేశామని తెలిపారు. భారత్‌ను ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రభుత్వం ఏకకాలంలో నాలుగు అంశాలపై పనిచేస్తోందని మోదీ తెలిపారు. వ్యాధులను నివారించడం, ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, అందరికీ వైద్య సేవలు అందించడం, వైద్యరంగంలో మౌలిక వసతుల నాణ్యత, పరిమాణాలు పెంచడం వంటి వాటిపై ప్రభుత్వం కీలకంగా దృష్టిపెట్టిందని వివరించారు. 

ఈ సందర్భంగా కొవిడ్‌ ముప్పును భారత్‌ సమర్థంగా ఎదుర్కొన్న తీరును మోదీ మరోసారి ప్రస్తావించారు. కొవిడ్‌ మనకు ఎన్నో పాఠాలు నేర్పిందని, భవిష్యత్‌లో ఇలాంటి సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో తెలియజేసిందన్నారు. మహమ్మారి సమయంలో భారత ఆరోగ్య రంగ బలాన్ని ప్రపంచం గుర్తించిందని తెలిపారు. భవిష్యత్తులో మన డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బందికి ప్రపంచవ్యాప్తంగా మరింత డిమాండ్‌ పెరుగుతుందని తెలిపారు. మన స్వదేశీ కొవిడ్‌ టీకాలకు అంతర్జాతీయంగా డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో దేశం కూడా అందుకు అనుగుణంగా సన్నద్ధమవుతోందని మోదీ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని