Corona : 97 శాతానికి పెరిగిన రికవరీ రేటు

దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది. గత కొన్ని రోజులుగా 50 వేలకు దిగువనే

Updated : 04 Jul 2021 10:48 IST

కొత్తగా 43,071 కేసులు.. 955 మరణాలు

దిల్లీ : దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది. గత కొన్ని రోజులుగా 50 వేలకు దిగువనే కొత్త కేసులు నమోదవుతుండటం ఊరట కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 43,071 కేసులు వెలుగులోకివచ్చాయి. అంతకుముందు రోజుతో పోల్చితే 2 శాతం తక్కువగా కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల సంఖ్యలో మాత్రం కాస్త పెరుగుదల కనిపించింది.

* నిన్న 18,38,490 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటి వరకూ నిర్వహించిన పరీక్షల సంఖ్య 41.28 కోట్లకు చేరింది.

* క్రితం రోజుతో పోల్చితే మరణాల సంఖ్య కాస్త పెరిగింది. గడిచిన 24 గంటల్లో 955 మంది కరోనాతో చికిత్స పొందుతూ మరణించగా.. ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,02,005కి చేరింది.

* ఇక నిన్న ఒక్క రోజే 52,299 మంది కరోనాను జయించగా.. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 2,96,58,078కి చేరి.. ఆ రేటు 97.09 శాతానికి పెరిగింది.

ప్రస్తుతం దేశంలో 4,85,350 క్రియాశీల కేసులు ఉన్నాయి.

నిన్న 63,87,849 మందికి టీకాలు అందించారు. వీటితో కలిపి ఇప్పటి వరకూ 35,12,21,306 టీకా డోసులు పంపిణీ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని