India Corona: 1,150 కొత్త కేసులు.. 83 మరణాలు

దేశంలో కరోనావైరస్ కట్టడిలోనే ఉంది. తాజాగా 4.6 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 1,150 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది.

Published : 09 Apr 2022 09:40 IST

దిల్లీ: దేశంలో కరోనావైరస్ కట్టడిలోనే ఉంది. తాజాగా 4.6 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 1,150 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. ముందురోజు కంటే కాస్త అధికంగా కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 1,194 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. క్రియాశీల కేసులు 11,365కి తగ్గి ఊరటనిస్తున్నాయి. ఇక నిన్న 83 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాల్లో హెచ్చుతగ్గులకు కేరళ మునుపటి గణాంకాలను సవరిస్తుండటమే కారణం. ఆ ఒక్క రాష్ట్రమే 75 మరణాలను వెల్లడించింది. ఈ రెండేళ్ల కాలంలో 4.30 కోట్ల మందికి కరోనా సోకగా.. అందులో 98.76 శాతం మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. బాధితుల సంఖ్య 0.03 శాతానికి తగ్గిపోయింది. మరణాలు రేటు 1.21 శాతంగా ఉంది. ఇక నిన్న 14.7 లక్షల మంది టీకా తీసుకోగా.. నిన్నటివరకూ 185 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని