crypto currency: 10.07కోట్ల మంది భారతీయుల వద్ద క్రిప్టో కరెన్సీ!

ఈ మధ్య కాలంలో క్రిప్టో కరెన్సీ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. కొన్ని దేశాల్లో క్రిప్టో కరెన్సీని అధికారికం చేయగా.. చాలా దేశాల్లో వీటిని కొనుగోలు చేయడం చట్టరిత్యా నేరమే. భారత్‌లోనూ 2018లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఇండియా క్రిప్టో కరెన్సీని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, అత్యున్నత

Published : 16 Oct 2021 16:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ మధ్య కాలంలో క్రిప్టో కరెన్సీ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. కొన్ని దేశాల్లో క్రిప్టో కరెన్సీని అధికారికం చేయగా.. చాలా దేశాల్లో వీటిని కొనుగోలు చేయడం చట్టరిత్యా నేరమే. భారత్‌లోనూ 2018లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా క్రిప్టో కరెన్సీని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, అత్యున్నత న్యాయస్థానం ఆర్‌బీఐ నిర్ణయాన్ని తోసిపుచ్చింది. మరోవైపు దేశంలో క్రిప్టో కరెన్సీని ఆమోదించేందుకు కేంద్రం ‘క్రిప్టో కరెన్సీ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ అఫిషియల్‌ డిజిటల్‌ కరెన్సీ’ బిల్లును సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో వీటి వినియోగం ఊపందుకుంది. ఎంతలా అంటే.. క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేయడంలో ప్రపంచంలోనే భారత్‌ అగ్రస్థానంలో నిలబడేంత.

మన దేశంలో పది కోట్ల మందికిపైగా క్రిప్టో కరెన్సీని కలిగి ఉన్నారని బ్రోకర్‌ చూస్‌ అనే సంస్థ వెల్లడించింది. క్రిప్టో కరెన్సీ వినియోగంపై ఆ సంస్థ ఏటా నివేదికను విడుదల చేస్తుంటుంది. ఈ ఏడాది నివేదికలో క్రిప్టో కరెన్సీని కలిగిన దేశాల జాబితాను రూపొందించగా.. అందులో 10.07కోట్ల మంది భారతీయులు ఈ డిజిటల్‌ కరెన్సీని కలిగి ఉన్నారని తేలింది. భారత్‌ తర్వాత స్థానాల్లో 2.74కోట్ల మందితో యూఎస్‌ఏ, 1.74కోట్ల మందితో రష్యా, 1.30కోట్ల మందితో నైజీరియా ఉన్నాయి. అదే దేశ మొత్తం జనాభాలో క్రిప్టో కరెన్సీ కలిగిన వారి రేటును చూస్తే.. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో జనాభా ఎక్కువ కాబట్టి.. మన దేశం 7.30శాతంతో ఐదో స్థానంలో నిలిచింది. 12.73శాతంతో ఉక్రెయిన్‌ తొలిస్థానంలో ఉండగా.. 11.91 శాతంతో రష్యా, 8.52శాతంతో కెన్యా, 8.31 శాతంతో యూఎస్‌ఏ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని