Electric Highway: నాగ్‌పుర్‌లో భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్‌ హైవే పైలట్‌ ప్రాజెక్టు: గడ్కరీ

భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్‌ హైవే (Electric Highway) పైలట్‌ ప్రాజెక్టును నాగ్‌పుర్‌లో చేపడతామని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) అన్నారు. 

Published : 14 Sep 2023 01:55 IST

దిల్లీ: ఆర్థికంగా లాభసాటి అయిన ఎలక్ట్రిక్‌ హైవేలను (Electric Highway) అభివృద్ధి చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) తెలిపారు. దిల్లీ-జైపుర్ మధ్య భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్‌ హైవేను అభివృద్ధి చేయడం తన కల అని గతంలో గడ్కరీ చెప్పారు. అయితే తాజాగా ఏసీఎంఏ వార్షిక సమావేశంలో పాల్గొన్న ఆయన నాగ్‌పుర్ నుంచి ఆ పైలట్‌ ప్రాజెక్టును చేపడతామని చెప్పడం గమనార్హం. ‘ఎలక్ట్రిక్‌ హైవేల నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ సరైందని నా అభిప్రాయం. ఇవాళ విద్యుత్ శాఖతో చర్చించా. యూనిట్ రూ.3.50 చొప్పున పొందడానికి ప్రయత్నిస్తున్నా. బయటి మార్కెట్‌లో యూనిట్‌ రూ.11 పలుకుతోంది’ ఆయన వివరించారు. ప్రభుత్వ కంపెనీకి తక్కువ ధరకు విద్యుత్ ఇవ్వడం ఆ శాఖకు సులభమైన పనేనని గడ్కరీ అభిప్రాయపడ్డారు. 

కేరళలో ‘బంగ్లాదేశ్‌ వేరియంట్‌’ కలవరం.. ఆ గ్రామాల్లో స్కూళ్లు, బ్యాంకుల మూసివేత..

ఎలక్ట్రిక్‌ హైవేలు ఆర్థికంగా లాభదాయకమని గడ్కరీ పేర్కొన్నారు. ఈ నిర్మాణాల్లో ప్రైవేటు పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తామని చెప్పారు. కేబుళ్ల నిర్మాణ బాధ్యతలు మొత్తం వారే చూస్తారని వివరించారు. ఎన్‌హెచ్‌ఏఐ ప్రస్తుత టోల్‌ మాదిరిగానే వాహనాల నుంచి విద్యుత్ టారిఫ్‌లను వసూలు చేస్తుందని వెల్లడించారు. ప్రస్తుతం విద్యుత్ రైళ్లు ఎలా నడుస్తున్నాయో.. ఎలక్ట్రిక్‌ హైవేలపై వాహనాలు అలాగే పరుగులు తీస్తాయన్నారు. స్వీడన్‌, నార్వే వంటి దేశాల్లో ఈ సాంకేతికతను వినియోగిస్తున్నారని తెలిపారు. రహదారిపై ఏర్పాటు చేసిన పవర్‌ కేబుళ్ల విద్యుత్‌ను వాడుకొని వాహనాలు సునాయాసంగా ప్రయాణిస్తాయన్నారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని