ISRO: భౌగోళిక నిఘాకు.. వచ్చే ఐదేళ్లలో 50 ఉపగ్రహాల ప్రయోగం!

భౌగోళిక నిఘా సమాచార సేకరణ కోసం వచ్చే ఐదేళ్లలో 50 ఉపగ్రహాలను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ తెలిపారు.

Published : 28 Dec 2023 21:25 IST

ముంబయి: దేశ భద్రతను మరింత పటిష్ఠం చేసే దిశగా కీలక పరిణామం! భౌగోళిక నిఘా (Geo- Intelligence) సమాచార సేకరణ కోసం వచ్చే ఐదేళ్లలో 50 ఉపగ్రహాలను ప్రయోగించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ (Somanath) వెల్లడించారు. సైనికుల కదలికలను ట్రాక్ చేయడంతోపాటు వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో భూప్రాంతాన్ని చిత్రీకరించే సామర్థ్యం కలిగిన ‘ఉపగ్రహాల పొర’ను సృష్టించడం ఇందులో భాగమని చెప్పారు. ‘ఐఐటీ-బాంబే’లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

ఇస్రో ఏఐ వత్సరం 2024

‘‘ఏదైనా ఒక దేశం బలం ఏంటంటే.. అది తన చుట్టూ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు అర్థం చేసుకోగల సామర్థ్యమే. దీన్ని సాధించే దిశగా మేం ఇప్పటికే 50 ఉపగ్రహాలను సిద్ధం చేశాం. భౌగోళిక నిఘా కోసం వచ్చే ఐదేళ్లలో వీటిని ప్రయోగిస్తాం. ఈ స్థాయిలో ఉపగ్రహాల ప్రయోగంతో.. దేశానికి ఎదురయ్యే ముప్పును మరింత తగ్గించవచ్చు. భూస్థిర కక్ష్య నుంచి దిగువ భూకక్ష్య వరకు ఈ ఉపగ్రహాలను ప్రవేశపెడతాం. భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూస్థిర కక్ష్యలోని ఉపగ్రహం భూమిపై ఏదైనా గుర్తిస్తే.. దిగువ కక్ష్యలోని మరొక ఉపగ్రహం ద్వారా దానికి సంబంధించి మరింత సమాచారం సేకరించవచ్చు’ అని సోమనాథ్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని