Kangana Ranaut: భారత తొలి ప్రధాని బోస్‌ అట..! కంగన వ్యాఖ్యలు వైరల్‌

బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut) తరచూ తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పుడు కూడా అదే తీరుతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. 

Published : 05 Apr 2024 14:41 IST

దిల్లీ: నటి, మండి (Mandi) నియోజకవర్గ భాజపా అభ్యర్థి కంగనా రనౌత్ (Kangana Ranaut) చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. భారత తొలి ప్రధాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని ఆమె అనడమే అందుకు కారణం.

ఒక ఇంటర్వ్యూలో కంగన మాట్లాడుతూ.. ‘‘మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు తొలి ప్రధాని బోస్ ఎక్కడికి వెళ్లారు..?’’ అని వ్యాఖ్యానించారు. దేశం కోసం పోరాడిన ఆయన్ను దేశంలోకి అడుగుపెట్టనివ్వలేదని అన్నారు. అయితే వ్యాఖ్యాత ఆమె మాటలను సరిచేశారు. కంగన ప్రకటనపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి వారి మాటలు తేలిగ్గా తీసుకోవద్దని, వీరంతా ఎక్కడ చదువుకున్నారంటూ విపక్ష నేతలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆమె విద్యాశాఖ మంత్రి అయితే పరిస్థితి ఏంటో..? అంటూ కామెంట్లు పెట్టారు.

‘సోనియా గాంధీ ఆకాంక్షలకు రాహుల్ బాధితుడు’: కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు

గతంలోను ఈ నటి ఇదేతరహా వ్యాఖ్యలు చేశారు. 2014లో ప్రధాని మోదీ ప్రధాని అయిన తర్వాతే దేశానికి అసలైన స్వాతంత్య్రం వచ్చిందంటూ వ్యాఖ్యలు చేసి, విమర్శల పాలయ్యారు. ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని అప్పట్లో పలువురు నేతలు డిమాండ్‌ చేశారు. ఇదిలాఉంటే.. మండి నియోజకవర్గానికి జూన్‌ ఒకటిన ఓటింగ్ జరగనుంది. రాజవంశీయులకు కంచుకోటైన ఈ స్థానంలో ఆమె పోటీ ఆసక్తిగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని