Vande Bharat Express: వందే భారత్‌ షెడ్‌ నిర్మాణం.. 78 చెట్లు తొలగింపునకు కేజ్రీవాల్‌ ఓకే!

వందేభారత్‌ రైళ్ల షెడ్‌ నిర్మాణం కోసం 78 చెట్ల తొలగింపు ప్రతిపాదనకు దిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌(Kejriwal) ఆమోదం తెలిపారు.

Published : 03 Jul 2023 15:17 IST

దిల్లీ: వందే భారత్‌(Vande Bharat) రైళ్ల మెయింటీనెన్స్‌ కోసం షెడ్‌ నిర్మాణానికి వీలుగా  దిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) కీలక నిర్ణయం తీసుకున్నారు.  షెడ్‌ నిర్మించేందుకు 78 చెట్లు తొలగించి.. వాటిని వేరేచోటకు మార్పిడి చేసే రైల్వే శాఖ ప్రతిపాదనకు సోమవారం ఆమోదం తెలిపారు.  రైల్వేశాఖ వీటిని తొలగించి కొత్తగా 780 మొక్కలు నాటాలన్న షరతును వ్యతిరేకించిన సీఎం వాటిని వేరేచోట ట్రాన్స్‌ప్లాంట్‌ చేసేందుకు ఆమోదం తెలిపినట్టు  సీఎంవో(Delhi CMO) ఓ ప్రకటనలో తెలిపింది. షెడ్డు నిర్మాణానికి అనుగుణంగా 78 చెట్లను తొలగించి వాటిని వేరేచోటకు మార్పుచేయాలని రైల్వేశాఖ నుంచి ప్రతిపాదన రావడంతో దేశ ప్రయోజనాల దృష్ట్యా సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.

దిల్లీలోని షకుర్‌ బస్తీలో ఈ అధునాతన రైళ్ల మెయింటీనెన్స్‌ కోసం షెడ్‌ నిర్మాణాన్ని ప్రతిపాదించిన రైల్వేశాఖ.. కొన్ని చెట్లు ఆటంకంగా ఉన్నాయని తెలిపింది. దీంతో దిల్లీ పర్యావరణ, అటవీశాఖకు రాసిన లేఖలో ఎనిమిది చెట్లు తొలగించి, 70 చెట్లను వేరే చోట ట్రాన్స్‌ప్లాంట్‌ చేసేందుకు అనుమతి కోరిందని సీఎంవో తెలిపింది. రైల్వేశాఖకు ఆధునిక మౌలికవసతులు అవసరమని.. దిల్లీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశానికి మెరుగైన వసతులు పొందేందుకు వీలు కలుగుతుందని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని