TAPAS UAV: 18 గంటలు ఏకధాటిగా ప్రయాణించిన తాపస్ యూఏవీ..!
బెంగళూరుకు చెందిన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ఏడీఈ) అభివృద్ధి చేస్తున్న మానవ రహిత విమానం(యూఏవీ) ‘తాపస్ 201’ను ఇటీవల విజయవంతంగా పరీక్షంచారు.
ఇంటర్నెట్‌డెస్క్: బెంగళూరుకు చెందిన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ఏడీఈ) అభివృద్ధి చేస్తున్న మానవ రహిత విమానం(యూఏవీ) ‘తాపస్ 201’ను ఇటీవల విజయవంతంగా పరీక్షంచారు. ఈ విషయాన్ని డీఆర్డీవో వెల్లడించింది. కర్ణాటకలోని చిత్రదుర్గ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో నిర్వహించిన పరీక్షల్లో 18 గంటలపాటు ఈ యూఏవీ ఎగిరింది. ఇది మేల్ (మీడియం ఆల్టిట్యూడ్, లాంగ్ ఎండ్యూరెన్స్) కేటగిరిలోకి వస్తుంది. దీని ఉత్పత్తి భాగస్వామిగా బీఈఎల్ వ్యవహరిస్తోంది.
తాపస్తో పలు రకాల విధులను నిర్వహించవచ్చు. ఇంటెలిజెన్స్ సేకరణ, నిఘా వంటి వాటికి దీనిని వినియోగించవచ్చు. ఇది మొత్తం 24 గంటల నుంచి 30 గంటల వరకు గాల్లోనే ఉండగలదు. ఈ మానవ రహిత విమానాన్ని భారత వెర్షన్ ప్రిడెటర్ డ్రోన్‌గా నిపుణులు అభివర్ణిస్తున్నారు. మధ్యశ్రేణి ఎలక్ట్రిక్ ఆప్టిక్, దీర్ఘశ్రేణి ఎలక్ట్రిక్ ఆప్టిక్, సింథటిక్ అపాచర్ రాడార్, ఎలక్ట్రానిక్-కమ్యూనికేషన్ ఇంటెలిజెన్స్ పరికరాలు ఇది తీసుకెళ్లగలదు. దీనిని పగలు, రాత్రి వేళల్లో కూడా వినియోగించవచ్చు.
తాపస్ 201 ప్రాజెక్టు ప్రారంభించిన తొలినాళ్లలో రుస్తుం-2 పేరిట వ్యవహరించేవారు. 2019లో దీనికి సంబంధించిన ఓ మానవరహిత విమానం చిత్రదుర్గ సమీపంలో కూలిపోయింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
2025లో అమెరికా, చైనా మధ్య యుద్ధం?
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30/01/2023)
-
World News
ఐదు నెలలుగా విమానాశ్రయంలోనే.. రష్యన్ పౌరుల ‘ది టెర్మినల్’ స్టోరీ!
-
India News
Vande Bharat Express: వందే భారత్ రైళ్లలో క్లీనింగ్ ప్రక్రియ మార్పు.. ఇకపై అలా చేయొద్దు ప్లీజ్!
-
Sports News
Virat - Rohit: విరాట్, రోహిత్.. టీ20ల్లో వీరిద్దరిలో ఒక్కరినైనా ఆడించాలి: పాక్ దిగ్గజం
-
Movies News
Pooja Hegde: సోదరుడి వివాహం.. పూజా హెగ్డే భావోద్వేగం!