Mahua Moitra: ఒత్తిడి చేసి, సంతకం చేయించారు: ట్విటర్‌లో మహువా సంచలన ఆరోపణ

తనపై వస్తోన్న ఆరోపణలు దుమారం రేపుతోన్న వేళ.. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా(Mahua Moitra) ట్విటర్‌లో పలు ప్రశ్నలు సంధించారు. వ్యాపారవేత్త హీరానందానికి చెందిన అఫిడవిట్ విశ్వసనీయతను ప్రశ్నించారు.

Updated : 20 Oct 2023 15:26 IST

దిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా( Mahua Moitra) రాజకీయంగా తీవ్రస్థాయి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆమెపై వస్తోన్న ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. దీనిపై మహువా ట్విటర్‌ వేదికగా సంచలన ప్రకటన చేశారు. ప్రధానమంత్రి కార్యాలయం హీరానందానిపై ఒత్తిడి తెచ్చి, తెల్లకాగితంపై సంతకం చేయించిందని అందులో ఆరోపించారు. ఆ కాగితంలోని సమాచారమే తర్వాత మీడియాకు లీక్‌ అయిందన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు గౌతం అదానీని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా లక్ష్యంగా చేసుకున్నారని హీరానందాని గ్రూప్‌ సీఈవో దర్శన్‌ హీరానందాని(businessman Darshan Hiranandani) గురువారం పేర్కొన్నారు. అదానీ సంస్థపై లోక్‌సభలో ప్రశ్నలు సంధించడానికి మొయిత్రాకు హీరానందాని నగదు చెల్లించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అదానీ లక్ష్యంగా పార్లమెంటులో ప్రశ్నలడగటానికి మొయిత్రా పార్లమెంటరీ లాగిన్‌ను ఉపయోగించుకున్నట్లు ఓ అఫిడవిట్‌లో హీరానందాని అంగీకరించినట్లు ఓ వార్తా సంస్థ గుర్తించింది.

23 వారాల గర్భవిచ్ఛితికి దిల్లీ హైకోర్టు అనుమతి

దాంతో అఫిడవిట్‌ విశ్వసనీయతను మహువా ప్రశ్నించారు. అలాగే పలు ప్రశ్నలు సంధించారు. ‘హీరానందానికి సీబీఐ, ఎథిక్స్‌ కమిటీ, ఇతర ఏ దర్యాప్తు సంస్థ ఇంతవరకు సమన్లు పంపలేదు. అలాంటప్పుడు అతడు ఆ అఫిడవిట్ ఎవరికి ఇచ్చినట్టు. ఆ అఫిడవిట్ ఎందుకు అధికారిక లెటర్‌హెడ్‌ రూపంలో లేదు. దానిని హీరానందాని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయలేదు. కానీ కొన్ని ప్రత్యేకించిన మీడియా సంస్థలకు మాత్రమే ఆ సమాచారం లీక్‌ అయింది. అదానీని ప్రశ్నించే ధైర్యం చేసే ప్రతి నేతను అణచివేసే చర్యల్లో ఇది భాగం’ అని తనపై వస్తోన్న ఆరోపణలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదిలా ఉంటే.. హీరానందాని లేఖ ఇంకా తమకు అందలేదని పార్లమెంట్‌ ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ వినోద్‌ సోంకార్ చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు మహువా మొయిత్రా( Mahua Moitra) డబ్బులు తీసుకున్నారంటూ, లోక్‌సభ వెబ్‌సైట్‌ లాగిన్ యాక్సెస్ ఓ వ్యాపారవేత్తకు ఇచ్చారని ఇదివరకు భాజపా ఎంపీ నిషికాంత్ దూబే (Nishikant Dubey) ఆరోపించిన సంగతి తెలిసిందే.  2019 నుంచి 2023 మధ్య కాలంలో మహువా అడిగిన 61 ప్రశ్నల్లో 50 ప్రశ్నలు దర్శన్‌ హీరానందానీ కోరిక మేరకు అడిగినవేనని ఆరోపించారు. దీనిపై ఆయన ఐటీ మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. ఈ ఆరోపణలను అత్యంత తీవ్రమైనవిగా పరిగణించి దర్యాప్తు చేపట్టాలని ఆయన ఐటీశాఖను కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని