MTHL: దేశంలో అతి పొడవైన సముద్రపు వంతెన విశేషాలివే..!

దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ‘ముంబయి ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌’ను ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించనున్నారు.

Updated : 11 Jan 2024 21:47 IST

ముంబయి: దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ‘ముంబయి ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌ (MTHL)’ రాకపోకలకు సిద్ధమైంది. ‘అటల్‌ సేతు’గా పిలుస్తోన్న దీన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) శుక్రవారం ప్రారంభించనున్నారు. ముంబయిలోని సేవ్రీ నుంచి రాయ్‌గఢ్‌ జిల్లాలోని నవా షేవాను కలుపుతూ రూ.21,200 కోట్ల వ్యయంతో ఆరు లేన్లుగా నిర్మించారు. మొత్తం పొడవు దాదాపు 22 కి.మీలు కాగా.. 16 కి.మీలకుపైగా అరేబియా సముద్రంపై ఉంటుంది.

ఈ వంతెన వీడియో, ఫొటోలను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా తన ‘ఎక్స్‌’ (గతంలో ట్విటర్‌) ఖాతాలో షేర్‌ చేశారు. ‘‘ముంబయి ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌కు సంబంధించి రాత్రిపూట తీసిన వీడియో ఇది. నిపుణులైన ఇంజినీరింగ్ బృందం కష్టానికి, నిబద్ధతకు నిదర్శనం. దీని నిర్మాణంతో అనుసంధానం, వాణిజ్యం మెరుగుపడనున్నాయి. ఈ గోల్డెన్‌ రిబ్బన్‌పై ప్రయాణించేందుకు వేచి చూస్తున్నా’’ అని ట్వీట్‌ చేశారు.

‘క్లీన్‌ సిటీ’గా ఇందౌర్‌.. వరుసగా ఏడోసారి

బ్రిడ్జిపై గరిష్ఠ వేగం 100 కి.మీలు కాగా, కనిష్ఠ వేగం 40 కి.మీలుగా నిర్దేశించారు. సేవ్రీ నుంచి నవా షేవాకు 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. ద్విచక్ర వాహనాలు, ఆటోలకు అనుమతి లేదు. ఒకసారి ప్రయాణిస్తే రూ.250 టోల్‌ వసూలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. శుక్రవారం వంతెన ప్రారంభమైన తర్వాత ధరలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని