MK Stalin: ‘నీట్‌’ నుంచి మినహాయింపు లభిస్తుంది: స్టాలిన్‌

నీట్‌ నుంచి తమిళనాడుకు మినహాయింపు లభిస్తుందని ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్‌ విశ్వాసం వ్యక్తంచేశారు.

Published : 26 Nov 2023 18:34 IST

చెన్నై: నీట్‌ పరీక్షను తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. నీట్‌ పరీక్షతో తమిళనాడుపై భారాన్ని మోపారని.. తద్వారా తమ రాష్ట్రంలోని వైద్య మౌలిక సదుపాయాలు నాశనం చేశారని మండిపడ్డారు. ప్రజల మద్దతుతో నీట్‌ నుంచి రాష్ట్రానికి మినహాయింపు లభిస్తుందన్నారు. ఆదివారం ఆయన డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఫర్‌ ఈక్వాలిటీ (DASE)  నాలుగో రాష్ట్ర మహాసభలో వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. 

చైనాలో నిమోనియా.. రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కీలక సూచన

ఈ సందర్భంగా స్టాలిన్‌ మాట్లాడుతూ.. ‘‘నీట్ మినహాయింపు కోసం న్యాయ పోరాటం చేస్తున్నాం. కొందరు అహంకారంతో అనొచ్చు. పదవుల్లో ఉన్న మరికొందరు కూడా నీట్ మినహాయింపు సాధ్యం కాదని అనొచ్చు. కానీ, నీట్‌ మినహాయింపు సాధించడం మన లక్ష్యం. ప్రజల మద్దతుతో ఇది జరుగుతుంది. డీఎంకే యువజన, విద్యార్థి, వైద్య విభాగాల ఆధ్వర్యంలో నీట్‌కు వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమం.. ప్రజా ఉద్యమంగా మారింది’’ అన్నారు.  మరోవైపు, వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష సామాజిక న్యాయానికి విరుద్ధమని వాదిస్తూ తమిళనాడుకు నీట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు మార్లు అసెంబ్లీలో తీర్మానాలు చేసి ఆమోదించిన విషయాన్ని గుర్తు చేశారు.  గతంలో డీఎంకే ప్రభుత్వాల హయాంలో రాష్ట్రంలో పటిష్టమైన ఆరోగ్య, వైద్య మౌలికవసతులు కల్పించడంలో తన తండ్రి, దివంగత నేత కరుణానిధి చేసిన సేవలను ఈ సందర్భంగా స్టాలిన్‌ గుర్తు చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు