Spy: సున్నిత సమాచారం చేరవేత.. పాకిస్థాన్‌ గూఢచారి అరెస్టు!

పశ్చిమ బెంగాల్‌లో ఓ పాకిస్థాన్‌ గూఢచారిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి ఫోన్‌లో రహస్య సమాచారం లభ్యమైనట్లు వెల్లడించారు.

Published : 26 Aug 2023 13:26 IST

కోల్‌కతా: దేశ భద్రతకు సంబంధించిన సున్నిత సమాచారాన్ని పాకిస్థాన్‌ (Pakistan)కు చేరవేస్తోన్న ఓ వ్యక్తిని పశ్చిమ బెంగాల్‌ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి సంబంధిత పత్రాలను (Sensitive Documents) స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి బెంగాల్‌లోని హావ్‌డాలో నివాసం ఉంటున్నాడు. అతడిని పాకిస్థాన్‌ గూఢచారి (Pakistan Spy)గా అనుమానిస్తోన్న పోలీసులు.. పక్కా సమాచారంతో అతడి ఇంట్లో తనిఖీలు నిర్వహించారు.

ఇమ్రాన్‌కు శిక్ష విధింపులో పొరపాటు

ఈ క్రమంలోనే దేశ భద్రతకు విఘాతం కలిగించే కార్యకలాపాల్లో అతడి ప్రత్యక్ష పాత్ర ఉన్నట్లు గుర్తించామని ఓ పోలీసు అధికారి తెలిపారు. సుదీర్ఘ విచారణ అనంతరం అతడిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ‘ఫొటోలు, వీడియోలు, చాట్‌ల రూపంలో అతడి ఫోన్‌లో సున్నిత సమాచారం లభ్యమైంది. వీటిని అతడు పాకిస్థాన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ వర్గాలకు పంపినట్లు తెలుస్తోంది’ అని అధికారి తెలిపారు. కోల్‌కతాలోని కొరియర్ సర్వీస్‌లో పనిచేస్తున్న నిందితుడు గతంలో దిల్లీలో ఉన్నాడని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు