Viral Video: పైలట్‌ స్పెషల్‌ అనౌన్స్‌మెంట్‌.. భావోద్వేగంతో కన్నతల్లి కంటతడి!

ఓ విమాన పైలట్‌ తన ఇంటి సభ్యులకు ఊహించని బహుమతి ఇచ్చాడు. తన ఫ్లైట్‌లోనే ప్రయాణిస్తున్న తల్లి, గ్రాండ్‌ పేరెంట్స్ విషయంలో స్పెషల్‌ అనౌన్స్‌మెంట్‌ చేసి, వారిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

Updated : 06 Apr 2024 08:34 IST

Viral video | ఇంటర్నెట్‌ డెస్క్‌: తమ కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవాలి.. వారు గర్వపడేలా చేయాలనేది ప్రతి ఒక్కరి కల. ఇలాంటి స్వప్నాన్నే నిజం చేస్తూ.. ప్రదీప్‌ కృష్ణన్‌ అనే ఓ విమాన పైలట్‌ తన ఇంటి సభ్యులకు ఊహించని బహుమతి ఇచ్చాడు. తన ఫ్లైట్‌లోనే ప్రయాణిస్తున్న తల్లి, గ్రాండ్‌ పేరెంట్స్ విషయంలో స్పెషల్‌ అనౌన్స్‌మెంట్‌ చేసి, వారిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాడు. దీంతో భావోద్వేగానికి గురైన కన్నతల్లి ఆనందభాష్పాలు రాల్చారు. హృదయాన్ని హత్తుకునేలా ఉన్న ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది

‘‘చెన్నై- కోయంబత్తూరు విమానంలో ఈరోజు మా అమ్మ, తాత, బామ్మ నాతో కలిసి ప్రయాణిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. మా తాత ఈ రోజే మొదటిసారి నాతో విమానంలో ప్రయాణిస్తున్నారు. గతంలో ఆయన నన్ను ఎన్నో సార్లు తన స్కూటర్‌పై తిప్పారు. బదులుగా ఇప్పుడు ఆయన్ను విమానంలో ఎక్కించుకున్నాను’’ అని కెప్టెన్‌ ప్రదీప్‌ కృష్ణన్‌ తన అనౌన్స్‌మెంట్‌లో సరదాగా పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులను ప్రయాణికులకు పరిచయం చేశారు. ఈ భావోద్వేగ క్షణంతో వారి కళ్లు ఆనందంతో చెమ్మగిల్లాయి.

భారత తొలి ప్రధాని బోస్‌ అట..! కంగన వ్యాఖ్యలు వైరల్‌

ఈ వీడియోను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ‘కుటుంబం, స్నేహితులతో కలిసి విమాన ప్రయాణం చేయడం అనేది ప్రతి ఒక్క పైలట్‌ కల’ అని వ్యాఖ్యను జోడించాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘‘మీ కుటుంబ సభ్యులు ఎంతో గర్వపడుతున్నారు’’ అంటూ ఓ నెటిజన్‌ స్పందించారు. ఇంటర్నెట్‌లో చూసిన బెస్ట్‌ వీడియో ఇదే అంటూ మరొకరు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు