Modi: వెల్‌కమ్ తులసీ భాయ్‌.. టెడ్రోస్‌కు ఆహ్వానం పలికిన ప్రధాని మోదీ

భారత పర్యటనకు వచ్చిన తన బెస్ట్‌ ఫ్రెండ్‌ తులసీభాయ్‌కు ప్రధాని మోదీ(Modi) ఆహ్వానం పలికారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేతను మోదీ ఆ పేరుతో ఎందుకు పిలిచారంటే..? 

Published : 16 Aug 2023 18:05 IST

దిల్లీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) అధినేత టెడ్రోస్‌ టెడ్రోస్‌ అథనామ్‌(Tedros Adhanom) ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. ఆయన గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో రెండురోజుల పాటు జరిగే సంప్రదాయ వైద్య అంతర్జాతీయ సదస్సు(Traditional Medicine Global Summit)లో పాల్గొనేందుకు వచ్చారు. ‘గుడ్‌ ఫ్రెండ్‌ తులసీ భాయ్’ అంటూ ప్రధాని మోదీ(PM Modi) ఆయనకు ఆహ్వానం పలికారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియోను షేర్ చేశారు. 

జీ20 దేశాల ఆరోగ్య మంత్రుల స్థాయి సమావేశంలో భాగంగా ఈ సదస్సు  జరుగుతుంది. దీనిలో పాల్గొనేందుకు వచ్చిన టెడ్రోస్‌ అక్కడ కొందరు ప్రతినిధులతో కలిసి దాండియా ఆడారు. దానికి సంబంధించిన వీడియోను మోదీ షేర్ చేస్తూ.. ‘గుడ్‌ ఫ్రెండ్ తులసీ భాయ్‌.. నవరాత్రికి సిద్ధమయ్యారని అర్థమవుతోంది’అని రాసుకొచ్చారు. 

కోర్టుల్లో లింగ వివక్షకు తావు లేకుండా.. సుప్రీం కోర్టు ‘హ్యాండ్‌బుక్‌’

టెడ్రోస్‌కు మోదీనే తులసీ భాయ్‌ అని పేరు పెట్టారు. గత ఏడాది భారత్‌ పర్యటనకు వచ్చిన ఆయన.. ఆరోగ్య సంస్థకు చెందిన సంప్రదాయ వైద్య అంతర్జాతీయ కేంద్ర భవనాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో ఆయన గుజరాతీలో మాట్లాడి ఆశ్చర్యపర్చారు. అప్పుడు అక్కడే ఉన్న మోదీ మాట్లాడుతూ..‘తనకు ఒక గుజరాతీ పేరు పెట్టమని టెడ్రోస్‌ నన్ను అడిగారు. ఒక గుజరాతీగా నా బెస్ట్‌ ఫ్రెండ్‌కు తులసీ భాయ్‌ పేరును సూచిస్తున్నాను’ అని ఆ సందర్భంలో చెప్పారు. దానిని ఉద్దేశించే ఇప్పుడు కూడా టెడ్రోస్‌ను ఆ పేరుతో పిలిచారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని