PM Modi: శ్రమదానం.. రామాయణ పారాయణం.. నాసిక్‌ పర్యటనలో ప్రధాని మోదీ

నాసిక్‌లోని ప్రసిద్ధ కాలారామ్‌ ఆలయ పరిసరాల్లో నిర్వహించిన ‘స్వచ్ఛభారత్‌’లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

Updated : 12 Jan 2024 16:19 IST

నాసిక్‌: దేశంలో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ సందడి మొదలైంది. మరికొన్ని రోజుల్లో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేయనున్న నేపథ్యంలో ప్రత్యేక అనుష్ఠానం అనుసరిస్తానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఇప్పటికే వెల్లడించారు. మహారాష్ట్రలోని నాసిక్‌ పర్యటనలో ఉన్న ప్రధాని.. అక్కడి ప్రసిద్ధ కాలారామ్‌ ఆలయాన్ని (Kalaram Temple) సందర్శించారు. ‘స్వచ్ఛ భారత్‌’లో భాగంగా ఆలయ పరిసరాలను స్వయంగా శుభ్రం చేశారు.

‘11 రోజుల ప్రత్యేక అనుష్ఠానం’ పాటించనున్న మోదీ

అనంతరం ఆలయంలో నిర్వహించిన రామాయణ పారాయణంలో పాల్గొన్నారు. ‘‘సంత్ ఏక్‌నాథ్ మరాఠీలో రచించిన ‘భావార్థ రామాయణం’లో శ్రీరాముడు అయోధ్యకు తిరిగివచ్చే ఘట్టాన్ని వివరిస్తూ సాగే శ్లోకాలను విన్నాను. ఈ పారాయణం చాలా ప్రత్యేకమైన అనుభవం’’ అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని