Corona: DPIIT సెక్రటరీ మృతి.. మోదీ విచారం

కరోనా వైరస్‌ మరో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని బలితీసుకుంది. ఈ వైరస్‌ సంబంధిత సమస్యలతో కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి డాక్టర్ గురుప్రసాద్ మహాపాత్ర.....

Updated : 19 Jun 2021 17:27 IST

దిల్లీ: కరోనా వైరస్‌ మరో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని బలితీసుకుంది. ఈ వైరస్‌ సంబంధిత సమస్యలతో కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి డాక్టర్ గురుప్రసాద్ మహాపాత్ర (59) ప్రాణాలు విడిచారు. ఏప్రిల్‌ నెల మధ్యకాలంలో కరోనా బారిన పడిన ఆయన దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్సపొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. మహాపాత్ర మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు సంతాపం తెలిపారు. ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. గురుప్రసాద్‌ మహాపాత్ర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఓ సమర్థవంతమైన అధికారి అని,  దేశం కోసం నిబద్ధతతో పనిచేశారంటూ కొనియాడారు.

డీపీఐఐటీ కార్యదర్శి అకాల మరణం తనను బాధించిందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. నిబద్ధతతో ప్రజల కోసం పనిచేసిన వ్యక్తిని కోల్పోవడం బాధాకరమన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. 

2019 ఆగస్టులో డీపీఐఐటీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించడానికి గురుప్రసాద్‌ మహా పాత్ర ఎయిర్‌పోర్ట్లుల అథారిటీ ఛైర్మన్‌గానూ సేవలందించారు. ఆయన 1986 బ్యాచ్‌ గుజరాత్‌ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. తొలుత వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు.  రాష్ట్ర స్థాయి సర్వీసుల్లో అయితే గుజరాత్‌లోని సూరత్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా సేవలందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని