గర్ల్‌ఫ్రెండ్‌ కోసం అమ్మాయిగా రెడీ అయ్యి.. పరీక్షకు వెళ్లి..

Punjab: గర్ల్‌ఫ్రెండ్‌ను ఎలాగైనా పాస్‌ చేయించేందుకు ఓ వ్యక్తి ఏకంగా ఆమెలా రెడీ అయ్యి పరీక్ష (Exam) రాసేందుకు వెళ్లాడు. చివరకు కటకటాలపాలయ్యాడు.

Updated : 15 Jan 2024 13:09 IST

ఫరీద్‌కోట్‌: ఓ సినిమాలో హీరోయిన్‌ కోసం హీరో అమ్మాయి వేషం వేసి పరీక్ష (Exam) రాసిన సీన్‌ గుర్తుందా? రియల్‌ లైఫ్‌లోనూ సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. తన స్నేహితురాలి కోసం ఓ వ్యక్తి అమ్మాయిగా రెడీ అయ్యి పరీక్ష రాసేందుకు వెళ్లాడు. సినిమాలో అంటే గుర్తుపట్టరు గానీ.. నిజజీవితంలో అలా జరగదు కదా..! బయోమెట్రిక్‌ (Biometric)తో దొరికిపోయి చివరకు కటకటాలపాలయ్యాడు. పంజాబ్‌ (Punjab)లోని ఫరీద్‌కోట్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

పంజాబ్‌లోని బాబా ఫరీద్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెన్స్‌.. జనవరి 7న మల్టిపర్పస్‌ హెల్త్‌ వర్కర్స్‌ పరీక్ష నిర్వహించింది. దీనికి పరమ్‌జీత్‌ కౌర్‌ అనే యువతి దరఖాస్తు చేసుకుంది. అయితే, ఆమె స్థానంలో పరీక్ష రాసేందుకు ఆమె బాయ్‌ఫ్రెండ్‌ అంగ్రేజ్‌ సింగ్‌ వెళ్లాడు. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు అమ్మాయిల డ్రెస్‌, బొట్టు, గాజులు, లిప్‌స్టిక్‌ పెట్టుకుని అచ్చం ఆమెలా రెడీ అయ్యాడు.

గంటలపాటు విమానం ఆలస్యం.. పైలట్‌పై ప్రయాణికుడి దాడి

అంతేనా.. తానే పరమ్‌జీత్‌ అని నమ్మించేందుకు ఆడవేషంలో ఉన్న తన ఫొటోలతో నకిలీ ఓటర్‌కార్డు, ఆధార్‌ కార్డు సృష్టించాడు. కానీ, చివరకు బయోమెట్రిక్‌ దగ్గర దొరికిపోయాడు. దరఖాస్తు సమయంలో ఇచ్చిన వేలిముద్రలతో అవి మ్యాచ్‌ కాకపోవడంతో అనుమానం వచ్చిన యూనివర్సిటీ సిబ్బంది ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. పరీక్ష రాసేందుకు వచ్చిన వ్యక్తి అబ్బాయి అని తెలిసి అందరూ అవాక్కయ్యారు. అతడిని పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు