Taliban: తాలిబన్లతో అందరూ సంబంధాలు పెట్టుకోవాలి..

అఫ్గానిస్థాన్‌లో మౌలిక మార్పులు సంభవించాయని, అందువల్ల తాలిబన్లతో అందరూ సంబంధాలు

Published : 31 Aug 2021 10:43 IST

 చైనా సూచన 

బీజింగ్‌: అఫ్గానిస్థాన్‌లో మౌలిక మార్పులు సంభవించాయని, అందువల్ల తాలిబన్లతో అందరూ సంబంధాలు పెట్టుకోవాలని చైనా సూచించింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ ఆదివారం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌కు ఫోన్‌ చేసి అఫ్గాన్‌ పరిస్థితిపై చర్చలు జరిపారు. అమెరికా సహా ప్రపంచ దేశాలన్నీ అఫ్గాన్ల జీవనానికి అవసరమయ్యే సాయాన్ని చేయాలని కోరారు. తాలిబన్ల పాలనా వ్యవహారాలకు మార్గదర్శనం చేయాలని సూచించారు. అమెరికా సైన్యం ఉపసంహరణ తరువాత కాబుల్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని తెలిపారు. ఇతర ఉగ్రవాద సంస్థలు రెచ్చిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఆ దేశ సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తునే ఉగ్రవాదం అణచివేతకు చర్యలు తీసుకోవాలని కోరారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని