
President Kovind: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కంటికి శస్త్రచికిత్స
దిల్లీ: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కంటికి శస్త్రచికిత్స జరిగింది. గురువారం ఉదయం దిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో రాష్ట్రపతి కోవింద్‌కు కంటి శుక్లాల (Cataract) ఆపరేషన్ జరిగినట్లు రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ విజయవంతమైందని.. ఆస్పత్రి నుంచి రామ్‌నాథ్ కోవింద్ డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇదిలాఉంటే, ప్రస్తుతం రామ్‌నాథ్ కోవింద్ వయసు 75ఏళ్లు. కాగా 2017 జులై 25 నుంచి రామ్‌నాథ్ కోవింద్ భారత 14వ రాష్ట్రపతిగా కొనసాగుతున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.