TMC: మహువా మొయిత్రాపై ఆరోపణలు.. తృణమూల్‌ కాంగ్రెస్‌ మౌనం

TMC distances itself from Mahua Moitra controversy: మహువా మొయిత్రా వ్యవహారంలో తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీ మౌనంగా ఉంటోంది.  ఈ విషయంలో దూరంగా ఉండాలని ఆ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Published : 21 Oct 2023 20:26 IST

Mahua Moitra controversy | కోల్‌కతా: డబ్బులు తీసుకుని లోక్‌సభలో ప్రశ్నలు లేవనెత్తారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ప్రధాని మోదీకి, గౌతమ్‌ అదానీకి వ్యతిరేకంగా పార్లమెంట్‌లో మాట్లాడేందుకు వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానీ నుంచి ఆమె డబ్బులు తీసుకున్నారంటూ భాజపా ఎంపీ నిషికాంత్‌ దూబె ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండగా.. మరోవైపు ఆ పార్టీ మాత్రం దీనిపై మౌనంగా ఉంటోంది. ఈ వ్యవహారంలో తలదూర్చకుండా ఉండడమే మంచిదని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

దుబాయ్‌ నుంచి మహువా ఐడీని వాడారు..’: దూబే మరో సంచలన ఆరోపణ

మహువా వ్యవహారంలో పార్టీ స్పందించాలనుకోవడం లేదని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తే దీనిపై స్పందిస్తే బాగుంటుందని ఆ పార్టీ పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర కార్యదర్శి, అధికార ప్రతినిధి కునాల్‌ ఘోష్‌ అన్నారు. పార్టీ నాయకత్వం వివాదంలోకి తలదూర్చడానికి ఇష్టపడడం లేదని, అందుకే ఈ వ్యవహారం నుంచి దూరం జరుగుతోందని పేరు చెప్పడానికి ఇష్టం లేని మరో నేత పేర్కొన్నారు. ఆరోపణలు వచ్చిన ప్రతిసారీ ఆ పార్టీ ఇలానే వ్యవహరిస్తుందంటూ భాజపా నేత రాహుల్‌ సిన్హా ఎద్దేవాచేశారు. తృణమూల్‌ నేతలు అరెస్టయినప్పుడు, వివాదాల్లో చిక్కుకున్నప్పుడు తమకేమీ పట్లనట్లు ఆ పార్టీ వ్యవహరిస్తుంటుందని అన్నారు. ఇప్పటికైనా మొయిత్రా వ్యవహారంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ తన వైఖరిని తెలియజేయాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని