Aamir Khan: నాకు నచ్చిన సినిమాలు చేస్తాను: ఆమిర్‌ ఖాన్‌

బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్  సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. 

Published : 09 Mar 2024 20:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటకు కొన్ని రోజులు విరామం ప్రకటించిన తర్వాత ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) వరుస సినిమాలు నిర్మిస్తున్నారు. ఆయన తన సొంత బ్యానర్‌పై నిర్మించిన చిత్రం ‘లాపతా లేడీస్‌’ (Laapataa Ladies). కామెడీ డ్రామాగా ఆమిర్‌ ఖాన్‌ మాజీ భార్య కిరణ్‌ రావ్‌ తెరకెక్కించారు. ఈ సినిమా మార్చి 1న విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమిర్‌ సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో మాట్లాడారు. ‘షారుక్‌ ఖాన్‌ మంచి సినిమాలు చేస్తూ విజయం సాధిస్తున్నారు. మీరు ఎందుకని పటాన్ వంటి చిత్రాల్లో నటించడం లేదు’ అని ఓ అభిమాని ట్వీట్‌ చేశాడు. దీనికి సమాధానంగా ‘‘షారుక్‌ ఖాన్‌ పటాన్‌ వంటి మంచి యాక్షన్‌ చిత్రాల్లో నటిస్తూనే ఉన్నారు. నేను నాకు నచ్చిన ‘లాపతా లేడీస్‌’ వంటి చిత్రాల్లో నటిస్తాను. మీరు ఆ సినిమాలు చూడండి’’ అని ఆమిర్‌ రిప్లై ఇచ్చారు. 

‘తారే జమీన్‌ పర్‌’ తరహాలో రానున్న ‘సితారే జమీన్‌ పర్‌’ చిత్రంలోను ఆమిర్‌ నటిస్తున్నారు.  ఈ సినిమా ప్రేక్షకులను నవ్విస్తుందని ఆమిర్‌ ఓ సందర్భంలో చెప్పారు. ‘లాల్‌ సింగ్‌ చద్దా’ తర్వాత సినిమాల నుంచి కొన్ని రోజులు విరామం తీసుకున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని