Ajay: ‘డోంట్ టచ్’ అంటూ ఆమె నాపై కేకలు వేసింది: నటుడు అజయ్
టిట్లా (విక్రమార్కుడు సినిమాలోని పాత్ర)గా తెలుగువారికి సుపరిచితమైన నటుడు అజయ్ (Ajay). తాజాగా ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘చక్రవ్యూహం’. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన తన కెరీర్ గురించి స్పందించారు.
హైదరాబాద్: గతంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించి.. ప్రస్తుతం సహాయనటుడిగా కొనసాగుతున్నారు నటుడు అజయ్ (Ajay). సుమారు రెండు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న అజయ్‌కు తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరు ఉంది. అయితే, కెరీర్ పరంగా తనకు ఎదురైన ఓ చేదు సంఘటన గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. ఓ సినిమా సెట్‌లో అందరి ముందు నటి తనపై కేకలు వేసిందని అన్నారు. ఆ క్షణం తనకు ఇబ్బందిగా అనిపించిందని చెప్పారు.
‘‘శ్రీహరి హీరోగా విజయన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓ సినిమాలో నేనొక కీలక పాత్ర పోషించాను. సెట్‌లోకి అడుగుపెట్టిన తర్వాతే రేప్ సీన్ షూట్ అని నాకు చెప్పారు. తీరా, సీన్ షూట్ చేస్తున్నప్పుడు సదరు నటి (ఉత్తరాదికి చెందిన ఓ మోడల్) వెంటనే.. ‘డోంట్ టచ్’ అని కేకలు వేసింది. రేప్ సీన్ షూట్ అని ఆమెకు చెప్పారో లేదో నాకు తెలియదు. కానీ, ఆక్షణం నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది. నా కెరీర్‌లో నేను ఎదుర్కొన్న ఒక చేదు సంఘటన అదే. కొంతసేపటి తర్వాత ఆ సీన్ మొత్తాన్ని రీ రైట్ చేసి షూట్ చేశారు’’ అని అజయ్ వివరించారు. అంతేకాకుండా ఆ తర్వాత తానెప్పుడూ అలాంటి సీన్స్‌లో నటించే ప్రయత్నం చేయలేదని చెప్పారు.
‘విక్రమార్కుడు’, ‘ఆర్య-2’, ‘దూకుడు’, ‘రాజన్న’, ‘గబ్బర్‌సింగ్’, ‘18 పేజీస్’, ‘విరూపాక్ష’ వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న అజయ్ ప్రస్తుతం ‘చక్రవ్యూహం’లో నటిస్తున్నారు. మధుసూదన్ దర్శకుడు. సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈసినిమాలో అజయ్ పోలీస్ పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన తన కెరీర్ గురించి మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ చందాదారులా? అయితే, ఈ విషయం తెలుసా?
-
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌తో పాటు ఆ స్టార్ హీరోయిన్!
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?
-
Vizag: సిగరెట్ కోసం స్నేహితుడినే హతమార్చారు!
-
social look: అనుపమ ఉవాచ.. రష్మిక ఫస్ట్‌లుక్.. ఇంకా ఎన్నో ముచ్చట్లు..
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/09/2023)