Sharwanand: బర్త్‌డే సర్‌ప్రైజ్‌.. కుమార్తెను పరిచయం చేసిన శర్వానంద్‌.. పేరేంటంటే?

శర్వానంద్‌ సోషల్‌ మీడియా వేదికగా తన కుమార్తెను పరిచయం చేశారు. సంబంధిత ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Published : 07 Mar 2024 02:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్: టాలీవుడ్‌ హీరో శర్వానంద్‌ (Sharwanand) అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. తన పుట్టిన రోజును పురస్కరించుకుని కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇందులో ఆశ్చర్యం ఏముందనుకుంటున్నారా? శర్వా షేర్‌ చేసిన పిక్స్‌లో తన కుమార్తె (Sharwanand Daughter) ఉండడం విశేషం. తాను తండ్రి అయిన విషయాన్ని ఈ హీరో ఇప్పటివరకు చెప్పలేదు. అందుకే ఆయన ఫ్యాన్స్‌, నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శర్వాకు బర్త్‌డే విషెస్‌తోపాటు ఫాదర్‌ అయినందుకు కంగ్రాట్స్‌ చెబుతున్నారు. తన ముద్దుల తనయకు లీలా దేవి (Leela Devi) అని పేరు పెట్టినట్లు శర్వా తెలిపారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయిన రక్షితను శర్వానంద్‌ గతేడాది పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్‌లోని జైపుర్‌లో ఉన్న లీలా ప్యాలెస్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది.

సినిమాల విషయానికొస్తే.. 34 చిత్రాలు పూర్తి చేసిన ఆయన ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో ‘మనమే’ (Manamey), అభిలాష్‌ రెడ్డి డైరెక్షన్‌లో ఓ మూవీ (#Sharwa36), రామ్‌ అబ్బరాజు తెరకెక్కిస్తున్న ఓ చిత్రం (#Sharwa37)లో నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని