Vishal: ప్రేమ పెళ్లే చేసుకుంటా.. త్వరలో ఆమెను పరిచయం చేస్తా: విశాల్‌

ప్రేమ, పెళ్లి గురించి తన మనసులోని మాట బయటపెట్టాడు నటుడు విశాల్‌. తన ప్రియురాలిని త్వరలోనే పరిచయం చేస్తానని చెప్పాడు.

Published : 09 Nov 2022 12:00 IST

చెన్నై: వివాహంపై తన మనసులోని మాట బయటపెట్టాడు నటుడు విశాల్ (Vishal)‌. తాను త్వరలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ‘‘నటీనటుల యూనియన్‌ బిల్డింగ్‌ నిర్మాణ పనులు మూడేళ్ల నుంచి కొనసాగుతున్నాయి. త్వరలోనే ఆ బిల్డింగ్‌ పనులు పూర్తి కానున్నాయి. అది పూర్తైన వెంటనే నేను పెళ్లి చేసుకుంటా. అది కూడా ప్రేమ వివాహమే’’ అని విశాల్‌ వెల్లడించాడు. అంతేకాకుండా తనకు కాబోయే అమ్మాయిని సమయం వచ్చినప్పుడు పరిచయం చేస్తానని చెప్పాడు.

‘లాఠి’, ‘డిటెక్టివ్ 2’, ‘మార్క్‌ ఆంటోనీ’ సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న విశాల్‌ చెన్నైలో జరిగిన ఓ సేవా కార్యక్రమంలో పాల్గొన్నాడు. సామూహిక వివాహాల వేడుకలో పాల్గొని.. వధూవరులకు అభినందనలు తెలిపాడు. నూతన దంపతులకు ప్రత్యేక బహుమతులు అందించడమే కాకుండా వారి పిల్లల చదువుకు సైతం సాయం చేస్తానని హామీ ఇచ్చాడు. ఈ సందర్భంగానే తన పెళ్లి గురించి స్పందించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని