HoneyRose:పెళ్లి అనేది ఒక పెద్ద బాధ్యత..: హనీరోజ్
తాజాగా విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న హనీరోజ్ (HoneyRose) పెళ్లిపై తన అభిప్రాయాన్ని పంచుకుంది. నటన అంటే తనకు చిన్నప్పటి నుంచి ఇష్టమని తెలిపింది.
హైదరాబాద్: ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) సినిమాతో భారీగా అభిమానులను సొంతం చేసుకుంది కేరళ ముద్దుగుమ్మ హనీరోజ్ (HoneyRose). ఆ సినిమా తర్వాత రోజూ సోషల్‌మీడియాలో కనిపిస్తూ సందడి చేస్తూనే ఉంటోంది. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవాల్లో, పలు కార్యక్రమాల్లో అతిథిగా పాల్గొంటూ అభిమానులను ఫిదా చేస్తోంది. తాజాగా విజయవాడలో ఓ బేకరి ఓపెనింగ్‌కు వెళ్లిన హనీ.. నటనపై తనకున్న ఆసక్తి, పెళ్లిపై తనకున్న అభిప్రాయాన్ని వెల్లడించింది. ఫ్యాన్స్ కోసం డ్యాన్స్ వేసి అలరించింది.
పెళ్లి అనేది ఓ పెద్ద బాధ్యత అని హనీరోజ్ తన అభిప్రాయాన్ని తెలిపింది. తాను ఆ బాధ్యతకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. వివాహబంధం బలంగా ఉండడం కోసం తాను ఏమైనా చేస్తానని స్పష్టం చేసింది. కేరళ ఆహారం అంటే తనకు చాలా ఇష్టమన్న హనీరోజ్ నటనపై ఆమెకున్న ప్రేమ గురించి మాట్లాడింది. చిన్నప్పటి నుంచే ఆమెకు నటనపై ఆసక్తి ఎక్కువగా ఉండేదని తెలిపింది. ప్రస్తుతం హానీ మాటలు వైరలవుతున్నాయి. ‘వీరసింహారెడ్డి’ సినిమాలో మీనాక్షి పాత్రలో మెప్పించిన హనీరోజ్ తర్వాత చిత్రం కోసం ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు బాలకృష్ణ (Balakrishna) రానున్న సినిమాలో కూడా హనీరోజ్‌కు అవకాశం ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రంలో ఈ అమ్మడికి అవకాశం ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
నా మెదడు సీసీ టీవీ ఫుటేజ్ లాంటిది
-
Sports News
రంగు రంగుల రబ్బరు బంతులతో.. టీమ్ఇండియా క్యాచ్‌ల ప్రాక్టీస్
-
Movies News
Kota Srinivas Rao: హీరోల పారితోషికం బయటకు చెప్పటంపై కోట మండిపాటు!
-
Sports News
Sehwag: ఆ ఓటమి బాధతో రెండు రోజులు హోటల్ రూమ్ నుంచి బయటికి రాలేదు: వీరేంద్ర సెహ్వాగ్
-
Movies News
Social Look: అనూ అవకాయ్.. సారా స్టెప్పులు.. బీచ్‌లో రకుల్
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/06/2023)