Raveena Tandon: రేప్ సన్నివేశాల్లోనూ అసభ్యతకు నేను చోటివ్వలేదు: రవీనా
‘రథ సారథి’, ‘ఆకాశ వీధిలో’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి రవీనా టాండన్. బాలీవుడ్లో తనకు ఎదురైన విమర్శల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ఇంటర్నెట్ డెస్క్: స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ ధరించేందుకు, ముద్దు సన్నివేశాల్లో నటించేందుకు నో చెప్పినందుకు తనపై అహంకారి అనే ముద్ర పడిందని ప్రముఖ నటి రవీనా టాండన్ (Raveena Tandon) అన్నారు. ఆంగ్ల మీడియాతో ఆమె ప్రత్యేకంగా మాట్లాడుతూ.. హిందీ చిత్ర పరిశ్రమలో విమర్శలు ఎదుర్కొన్నానని తెలిపారు. కెరీర్ తొలినాళ్లలో జరిగిన సంఘటనల గురించి వివరించారు. ‘‘కొన్ని విషయాల్లో నేను అసౌకర్యంగా ఉండేదాన్ని. డ్యాన్స్ విషయానికొస్తే.. అన్‌కంఫర్ట్‌గా ఫీలైన స్టెప్పును నేను చేయనని కచ్చితంగా చెప్పేదాన్ని. స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ ధరించాలని నేనెప్పుడూ అనుకోలేదు. ముద్దు సన్నివేశాల్లో నటించలేదు. అందుకు నాపై అహంకారి అనే ముద్ర వేశారు. రెండు రేప్ సన్నివేశాల్లో నటించినప్పటికీ ఎలాంటి అసభ్యతకు తావివ్వకుండా జాగ్రత్త తీసుకున్నా. డ్రెస్సుపై ఒక్క చిరుగూ లేకుండా రేప్ సీన్స్‌లో నటించిన నటిని నేనొక్కదాన్నే. అంతలా నా కాస్ట్యూమ్స్ చెక్కు చెదరకుండా ఉండేవి’’ అని ఆమె చెప్పారు. ఒకానొక సమయంలో బాడీ షేమింగ్ ట్రోల్స్ ఎదుర్కొన్నానని తెలిపారు.
వదులుకున్న సినిమా అవకాశాల గురించి చెబుతూ.. ‘‘డర్’ (1993) అవకాశం ముందుగా నాకు వచ్చింది. అందులో అసభ్యకర సీన్స్ లేవు. కానీ, కొన్ని సన్నివేశాలు ఎందుకో నాకు అసౌకర్యంగా అనిపించాయి. స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ ధరించనని దర్శక, నిర్మాతలకు చెప్పేశా. కరిష్మా కపూర్ కథానాయికగా పరిచయమైన ‘ప్రేమ్ ఖైదీ’ (1991) కోసం ముందుగా నన్ను సంప్రదించారు. అందులోని హీరోహీరోయిన్ల మధ్య వచ్చే ఓ సీన్ నాకు నచ్చలేదు. అందుకే ఆ చిత్రాన్ని వదిలేశా’’ అని రవీనా తెలిపారు.
‘పత్తార్ కే ఫూల్’తో 1991లో నటిగా కెరీర్ ప్రారంభించిన రవీనా టాండన్ ‘రథ సారథి’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘బంగారు బుల్లోడు’, ‘ఆకాశ వీధిలో’ నాయికగా తన అందం, అభినయంతో ఆకట్టుకున్నారు. 2014లో వచ్చిన ‘పాండవులు పాండవులు తుమ్మెద’లో కీలక పాత్ర పోషించిన ఆమె పాన్ ఇండియా చిత్రం ‘కేజీయఫ్ ఛాప్టర్ 2’ (KGF Chapter 2)తో మరోసారి ఇక్కడి వారిని అలరించారు. అందులో పోషించిన ప్రధాని రమీకా సేన్ పాత్ర ఆమెకు విశేష క్రేజ్ తీసుకొచ్చింది. రవీనా సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆమెను పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. ఈసందర్భంగా ‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ కొత్త తేదీని ప్రకటించింది. -
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
మూడు సినిమాల తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు షారుక్ చెప్పారు. -
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
ప్రేమ తన జీవితంలో కీలకపాత్ర పోషిస్తుందని నటి శోభితా ధూళిపాళ్ల అన్నారు. -
సింపుల్‌గా నటుడి కుమార్తె వివాహం
మలయాళ నటుడు జయరాం కుమార్తె వివాహం గుడిలో సింపుల్‌గా జరిగింది. -
యశ్ ‘టాక్సిక్’పై వైరలవుతోన్న న్యూస్.. ఎన్ని భాగాలంటే!
యశ్ నటిస్తోన్న ‘టాక్సిక్’ చిత్రానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
ఇప్పటితో పోలిస్తే తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని నటి సోనాలి బింద్రే అన్నారు. -
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్‌డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. -
‘పుష్ప2’ స్టెప్‌పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్‌కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. -
సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్‌తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
స్విమ్మింగ్ పూల్‌లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు. -
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అందులో హీరోగా ఎవరు నటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
సుకుమార్ కుమార్తెకు ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డు దక్కింది. -
ఎన్టీఆర్‌ను కలిసిన బాలీవుడ్ సీనియర్ నటుడు.. ఇష్టమైన హీరో అంటూ పోస్ట్
ఎన్టీఆర్‌ను బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కలిశారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
యంగ్‌గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
మొదటి సారి కపిల్‌శర్మ కార్యక్రమానికి వచ్చిన ఆమిర్ ఖాన్ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. -
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
శ్రీసింహా హీరోగా నటించిన ‘ఉస్తాద్’, సత్యం రాజేశ్ ‘పొలిమేర 2’ చిత్రాలకు ‘దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డులు దక్కాయి.