Sanjay Dutt: కేజీయఫ్‌ 2 అప్‌డేట్‌..  సంజయ్‌ దత్‌ డబ్బింగ్‌ పూర్తి

యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం  ‘కేజీయఫ్‌ 2’. 2018లో వచ్చిన ‘కేజీయఫ్‌ 1’కు కొనసాగింపుగా రానుంది. ఇందులో ‘అధీర’ అనే ప్రతినాయకుడి పాత్రను పోషించారు బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌.  తాజాగా ‘కేజీయఫ్‌ 2’కి సంబంధించిన ఓ అప్‌డేట్‌ను ఇచ్చారాయన.

Updated : 07 Dec 2021 20:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం  ‘కేజీయఫ్‌ 2’. 2018లో వచ్చిన ‘కేజీయఫ్‌ 1’కు కొనసాగింపుగా రానుంది. ఇందులో ‘అధీర’ అనే ప్రతినాయకుడి పాత్రను పోషించారు బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌.  తాజాగా ‘కేజీయఫ్‌ 2’కి సంబంధించిన ఓ అప్‌డేట్‌ను ఇచ్చారాయన. ‘‘ అధీర పాత్రకి డబ్బింగ్‌ పూర్తైంది. 2022 ఏప్రిల్‌ 14న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది’’ అంటూ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ఇందులో పోషించిన ప్రతినాయకుడి పాత్ర  తనకు చాలా ప్రత్యేకమైనదన్నారు సంజయ్‌. దయాదాక్షిణ్యాలు లేని అతిక్రూరుడి అధీర పాత్రకోసం ఎంతో శ్రమించానని.. మేకప్‌ వేసుకోవడానికే గంటన్నర సమయం పట్టింది గతంలో చెప్పారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా రవీనా టాండన్ ‌, ప్రకాశ్‌రాజ్‌, రావు రమేశ్‌ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని