Adipurush: ‘ఆదిపురుష్‌’ సెన్సార్‌ రిపోర్ట్‌.. రన్‌టైమ్‌ ఎంతంటే?

ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ సినిమా సెన్సార్‌ రిపోర్ట్‌ పూర్తయింది. ఈ సినిమా రన్‌టైమ్‌ ఎంతంటే?

Published : 08 Jun 2023 15:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌ (prabhas) అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్‌ ఇండియా చిత్రం.. ‘ఆదిపురుష్‌’ (adipurush) త్వరలోనే విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్‌ (Adipurush censor) పూర్తి చేసుకుంది. సెన్సార్‌ బోర్డు (Central Board of Film Certification) ఈ చిత్రానికి యు (U) సర్టిఫికెట్‌ జారీ చేసింది. ఈ సినిమా నిడివి 2 గంటల 59 నిమిషాలు. టాలీవుడ్‌లో చాలా తక్కువ చిత్రాలు ఇంతటి రన్‌టైమ్‌ (సుమారు 3 గం.)తో తెరకెక్కాయి. కంటెంట్‌ బాగుంటే సినిమా ఎన్ని గంటలున్నా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయం.. నాటి ‘దానవీర శూర కర్ణ’ (Daana Veera Soora Karna) నుంచి గతేడాది వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) వరకు నిరూపితమైంది.   

రామాయణం ఆధారంగా బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్‌.. రాముడిగా, హీరోయిన్‌ కృతిసనన్‌.. సీతగా కనిపించనున్నారు. రావణుడి పాత్రలో లంకేశ్‌గా సైఫ్‌ అలీఖాన్‌, హనుమంతుడిగా సన్నీసింగ్‌ నటించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా జూన్‌ 16న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఇప్పటికే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను తిరుపతిలో భారీ స్థాయిలో నిర్వహించిన సంగతి తెలిసిందే. సినిమా టికెట్ల విక్రయంలో అటు చిత్ర బృందం, ఇటు ఈ సినిమాలో భాగస్వామి అయిన ప్రముఖ నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా ప్రదర్శితమయ్యే ప్రతి థియేటర్‌లో ఓ సీటును హనుమంతుడికి కేటాయిస్తున్నట్టు టీమ్‌ ప్రకటించింది. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు 10 వేలకుపైగా టికెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్టు అభిషేక్‌ అగర్వాల్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని