Adipurush OTT: ‘ఆదిపురుష్‌’ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుందంటే?

Adipurush OTT: ‘ఆదిపురుష్‌’ స్ట్రీమింగ్‌ అయ్యే వేదిక వెల్లడైంది. ప్రముఖ ఓటీటీ ఈ చిత్ర రైట్స్‌ను దక్కించుకుంది. పూర్తి వివరాలు ఏంటో చూసేయండి..

Updated : 16 Jun 2023 20:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభాస్‌ (Prabhas) కీలక పాత్రలో ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆది పురుష్‌’(Adipurush). శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం... విజువల్‌ వండర్‌గా రామాయణాన్ని తీర్చిదిద్దారని ప్రశంసలు అందుకుంటోంది. దీనికితోడు రాముడిగా ప్రభాస్‌ నటన, పాటలు సినిమాపై పాజిటివ్‌ టాక్‌ను తీసుకొచ్చాయి. కొత్త సినిమా ఏది విడుదలైనా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘ఆదిపురుష్‌’ స్ట్రీమింగ్‌ అయ్యే వేదిక కోసం నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.

‘ఆదిపురుష్‌’ ఓటీటీ రైట్స్‌ను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (adipurush ott platform) దక్కించుకుంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. అయితే, గత చిత్రాలతో పోలిస్తే, ఈసారి ఓటీటీలో విడుదల కావడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల టాక్‌. ‘ఆదిపురుష్‌’లాంటి సినిమాను థియేటర్‌లో చూస్తే ఆ అనుభూతి సరికొత్తగా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. అందుకు అనుగుణంగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోతో అగ్రిమెంట్‌ చేసుకున్నట్లు సమాచారం. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఎనిమిది వారాల తర్వాత ‘ఆదిపురుష్‌’ ఓటీటీలోకి రావచ్చు. అంటే దాదాపు 60 రోజులపైనే సమయం పడుతుంది.

రామాయణగాథకు ఆధునిక హంగులు జోడించి ఓం రౌత్‌ ‘ఆదిపురుష్‌’ను తీర్చిదిద్దారు. రాఘవుడిగా ప్రభాస్‌, జానకిగా కృతిసనన్‌, లంకేశ్‌గా సైఫ్‌ అలీఖాన్‌ నటించారు. 3డీలో విజువల్స్‌ మరింత ఆకట్టుకునేలా ఉన్నాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

ఆదిపురుష్‌ రివ్యూ కోసం క్లిక్‌చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని