Adivi Sesh: ఆ సమయంలో ఏంచేయాలో అర్థంకాక ఏడ్చేశాను..: అడివి శేష్
అడివి శేష్(Adivi Sesh) హీరోగా నటించిన మేజర్(Major) సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనను గుర్తు్చేసుకున్నారు. సెట్‌ను తొలగించాలని చూశారని అప్పుడు చాలా బాధపడ్డానని తెలిపారు.
హైదరాబాద్: ఈ ఏడాది భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రాల్లో మేజర్(Major) ఒకటి. అడివి శేష్(Adivi Sesh) హీరోగా నటించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అడివి శేష్ మేజర్ క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో జరిగిన ఓ సంఘటనని గుర్తుచేసుకున్నారు. బాలీవుడ్ సినిమా షూటింగ్ కోసం ‘మేజర్’ సెట్‌ను తొలగించాలనుకున్నారని ఆ సమయంలో చాలా బాధపడ్డానని చెప్పారు. మేజర్ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో తాను, చిత్రబృందం ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించారు.
‘‘మేము షూటింగ్ చేస్తున్న స్టూడియోను మా తర్వాత ఒక బాలీవుడ్ చిత్రయూనిట్ బుక్ చేసుకుంది. మేజర్ సినిమాలో అగ్నిప్రమాదానికి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించడంతో నేను కొంచెం అస్వస్థతకు గురయ్యాను. దీంతో షూటింగ్ కాస్త ఆలస్యం అయింది. స్టూడియో వాళ్లు మా సెట్‌ను కూల్చేయడానికి రెడీ అయ్యారు. వాళ్లని ఇంకాస్త సమయం కావాలని అడిగినా వాళ్లు అంగీకరించలేదు. క్లైమాక్స్‌లో 8 సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. కేవలం అరగంట మాత్రమే సమయం ఉండడంతో నాకు ఏం చేయాలో అర్థం కాక ఏడవడం మొదలుపెట్టాను. మా దర్శకుడు శశికిరణ్ తిక్కా నా దగ్గరకు వచ్చి ‘ఇప్పుడు మీరు ఏ భావోద్వేగానికి లోనవుతున్నారో దాన్నే కెమెరా ముందు చూపండి’ అన్నారు. రెండు కెమెరాలతో సన్నివేశాలు అన్నింటినీ అనుకున్న సమయానికి పూర్తిచేశాం’’ అని చెప్పారు. ఇక ఈ ఏడాది వచ్చిన అడివి శేష్ ‘హిట్2’ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద హిట్ అయిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Rakul Preet Singh: అదొక కీలక నిర్ణయం.. ఎన్నో తిరస్కరణలు ఎదుర్కొన్నా: రకుల్ ప్రీత్ సింగ్
-
Bomb blast: బలూచిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 34 మంది మృతి
-
Jet Airways: జెట్ ఎయిర్వేస్లో కీలక పరిణామం.. వచ్చే ఏడాది నుంచి రెక్కలు
-
Madhya Pradesh rape: వైరల్ వీడియో చూసి, నా బిడ్డను గుర్తించా: బాలిక తండ్రి ఆవేదన
-
Apple Devices: ఐఓఎస్ యూజర్లకు కేంద్రం సూచన.. అప్డేట్ విడుదల చేసిన యాపిల్
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు