KTR: కేటీఆర్‌ సర్‌.. త్వరగా కోలుకోవాలంటే ‘డీజే టిల్లు’ చూడండి

కాలి గాయంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ (KTR).

Updated : 24 Jul 2022 15:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కాలి గాయంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ (KTR). ఆదివారం పుట్టినరోజు రావడంతో సామాజిక మాధ్యమాల వేదికగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మంత్రి కేటీఆర్‌ త్వరగా కోలుకోవాలని అభిమానులు, కార్యకర్తలతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా ట్విటర్‌ వేదికగా ఆకాంక్షించారు. ఈ క్రమంలో ఓటీటీలో అలరించే సినిమాలు/వెబ్‌సిరీస్‌లు ఉంటే చెప్పమని కేటీఆర్‌ కోరిన సంగతి తెలిసిందే. దీంతో నెటిజన్లు అనేక సినిమాలు, వెబ్‌సిరీస్‌లను సూచించారు. తాజాగా ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా(Aha) ఆదివారం కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. అంతేకాదు, త్వరగా కోలుకోవాలంటే, ‘డీజేటిల్లు’ (DJ Tillu) చూడాలని వైద్యులు సూచించినట్లు ట్వీట్‌ చేసింది. అలాగే బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘ఎన్‌బీకే అన్‌స్టాపబుల్‌’, (NBK unstoppable) అమలాపాల్‌ ‘కుడి ఎడమైతే’ (Kudi yedamaithe), ప్రియమణి ‘భామాకలాపం’ (Bhamakalapam) కూడా మిస్సవద్దని పేర్కొంది.

ఇక జీ5 కూడా కేటీఆర్‌కు కొన్ని సినిమాలు/వెబ్‌సిరీస్‌లను సూచించింది. ‘‘కేటీఆర్‌గారూ గుడ్‌ మార్నింగ్‌ ‘మా నీళ్ల ట్యాంకు’ (maa neela tank) తో స్టార్ట్‌ చేసి, ‘రెక్కి’ (Recce) తో థ్రిల్‌ అవుతూ, లంచ్‌ టైమ్‌కి ఫ్యామిలీ మొత్తం ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ (oka chinna family story) కంప్లీట్‌ చేసి, రాత్రికి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చూసేయండి. త్వరగా రికవరీ అవుతారు. కానీ, ఒక్క విషయం జాగ్రత్త.. ‘చూస్తూనే ఉండిపోతారు’’ అంటూ కేటీఆర్‌ త్వరగా కోలుకోవాలని ట్వీట్‌ చేసింది.

ఇక శనివారం పలువురు నెటిజన్లు కూడా మంత్రి కేటీఆర్‌కు కొన్ని సూచనలు చేశారు. అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన ‘మోడ్రన్‌ లవ్‌ హైదరాబాద్‌’ వీక్షించమని ఓ నెటిజన్‌ సూచించారు. ‘పంచాయత్‌’ చూడాలని ఒకరు.. మౌస్, ‘కింగ్‌డం సీజన్‌ 1, 2’ కొరియన్‌ సిరీస్‌ల పేర్లు మరొకరు చెప్పుకొచ్చారు. డార్క్‌, గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌, మనీ హైస్ట్‌, ది బాయ్స్‌, వర్జిన్‌ రివర్‌, డీకపుల్డ్‌, ఒజార్క్‌, బెటర్‌ కాల్‌ సాల్‌, స్ట్రేంజర్‌ థింగ్స్‌, డెసిగ్నేటెడ్‌ సర్వైవర్‌, నార్కోస్‌, టెహ్రాన్‌, రాకెట్‌ బాయ్స్‌, పీకీ బ్లైండర్స్‌, బ్లాక్‌లిస్ట్‌, మిడ్‌నైట్‌ మాస్‌, హాల్ట్‌ అండ్‌ క్యాచ్‌ ఫైర్‌, హౌస్‌ ఆఫ్‌ కార్డ్స్‌, లాస్ట్‌ ఇన్‌ స్పేస్‌ తదితర షోలు సూచించారు .మంత్రి కేటీఆర్(KTR) కాలికి గాయం కావడంతో.. వైద్యులు ఆయనకు మూడు వారాల విశ్రాంతి సూచించిన విషయం తెలిసిందే.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని