Ahimsha: ‘అహింస’కు తేజ సరికొత్త ప్రచారం.. వాయిస్ పోస్టర్స్ చూశారా?
తేజ దర్శకత్వంలో అభిరామ్ కథానాయకుడిగా పరిచమవుతున్న చిత్రం ‘అహింస’. ఇందులోని పాత్రలను పరిచయం చేస్తూ వీడియో పోస్టర్ విడుదల చేశారు.
హైదరాబాద్: వైవిధ్యభరితమైన ప్రేమకథా చిత్రాలకు చిరునామా దర్శకుడు తేజ (Teja). ఇప్పుడాయన నుంచి వస్తున్న కొత్త చిత్రం ‘అహింస’ (Ahimsa). ఈ సినిమాతో దగ్గుబాటి అభిరామ్ (Abhiram) హీరోగా పరిచయమవుతున్నారు. దీన్ని పి.కిరణ్ నిర్మిస్తున్నారు. గీతికా తివారీ కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకోగా, ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ‘అహింస’ చిత్రంలో నటిస్తున్న పాత్రలను తేజ సరికొత్తగా పరిచయం చేశారు. ముఖ్య పాత్రల వాయిస్‌లను వినిపిస్తూ పోస్టర్‌లు విడుదల చేశారు.
‘‘తేజ శైలిలో యువతరాన్ని ఆకట్టుకునే అంశాలతో వినోదాత్మకంగా సాగే చిత్రమిది. యాక్షన్‌తో పాటు అన్ని రకాల వాణిజ్యాంశాలు ఉంటాయి. నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. రజత్ బేడీ, సదా, రవి కాలే, కమల్ కామరాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: ఆర్పీ పట్నాయక్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, మాటలు: అనిల్ అచ్చుగట్ల, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Ap Special Status: ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి తేల్చి చెప్పిన కేంద్రం
-
Movies News
rangamarthanda review: రివ్యూ: రంగ మార్తాండ
-
Sports News
Sachin - Sehwag: ముల్తాన్ టెస్టులో సిక్స్ కొడతానంటే.. సచిన్ అలా అనేశాడు: సెహ్వాగ్
-
World News
Medvedev: క్షిపణి రావొచ్చు.. ఆకాశాన్ని గమనిస్తూ ఉండండి: ఐసీసీకి మెద్వదేవ్ వార్నింగ్
-
Movies News
Brahmanandam: చనిపోయే వరకూ కమెడియన్‌గానే ఉంటా: బ్రహ్మానందం
-
General News
TSPSC: పేపర్ లీకేజీ కేసు స్టేటస్ రిపోర్టు ఇవ్వండి: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు