Aishwarya Lekshmi: నటిని అవుతానంటే నా తల్లిదండ్రులే వ్యతిరేకించారు: ఐశ్వర్య లక్ష్మి

తన సినీ కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటి ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi). నటిని అవుతానంటే ఇంట్లో వాళ్లే అంగీకరించలేదని చెప్పారు.

Updated : 03 Jun 2023 19:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తాను నటిని అవుతానంటే తల్లిదండ్రులే అంగీకరించలేదని నటి ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi) తెలిపారు. సినిమా పరిశ్రమపై తన ఇంట్లో వాళ్లకు మంచి అభిప్రాయం లేదని ఆమె అన్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తన కెరీర్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మాదొక మధ్యతరగతి కుటుంబం. నేను ఎం.బి.బి.ఎస్‌ పూర్తి చేశాను. వైద్యురాలిగానే కెరీర్‌ ఊహించుకున్నాను. కానీ, అనుకోకుండా నటిని అయ్యాను. ఇది విధి నిర్ణయం కావొచ్చు. అయితే, నాకు నటిగా అవకాశం వచ్చినప్పుడు ఇంట్లో వాళ్లు అస్సలు అంగీకరించలేదు. ఎంతగానో వ్యతిరేకించారు. సమాజంలో విన్న మాటల ప్రకారం సినిమా రంగంపై వాళ్లకు నెగెటివ్‌ అభిప్రాయం ఉండేది. దాంతో యాక్టింగ్‌ని గౌరవప్రదమైన కెరీర్‌గా వాళ్లు భావించలేదు. ఇప్పటికీ వాళ్లు నా కెరీర్‌ విషయంలో అంత సుముఖంగా లేరు. ఇక, నా దృష్టిలో సినీ పరిశ్రమలో కొనసాగడం అంత సులభమైన విషయం కాదు. ప్రతిరోజూ పోరాటం చేయాల్సి ఉంటుంది’’ అని ఆమె వెల్లడించారు.

Njandukalude Nattil Oridavela అనే మలయాళీ సినిమాతో ఐశ్వర్య నటిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా విజయం సాధించడంతో ఆమెకు అవకాశాలు వరుస కట్టాయి. మలయాళంలోనే కాకుండా తమిళం, తెలుగులోనూ ఆమె సినిమాలు చేస్తున్నారు. ఇక, ‘గాడ్సే’తో తెలుగు తెరకు పరిచయమైన ఆమె ‘అమ్ము’తో అందరి మన్ననలు అందుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని