Twinkle Khanna: 50 ఏళ్ల వయసులో మాస్టర్స్‌ డిగ్రీ.. భార్యపై అక్షయ్‌ ఎమోషనల్ పోస్ట్‌

ఒకప్పటి హీరోయిన్‌ ట్వింకిల్‌ ఖన్నా 50 ఏళ్ల వయసులో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశారు. ఆమె భర్త, నటుడు అక్షయ్‌కుమార్‌ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు.

Published : 18 Jan 2024 02:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకప్పటి హీరోయిన్‌, తన భార్య ట్వింకిల్‌ ఖన్నా (Twinkle Khanna) మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేయడంపై బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar) ఆనందం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియా వేదికగా ఆమెను ప్రశంసిస్తూ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. ‘‘చదువుకోవాలనుందని రెండేళ్ల క్రితం నువ్వు నాకు చెప్పిన సమయంలో ఆశ్చర్యపోయా. ఎంతో కష్టపడి అనుకున్నది సాధించావు. ఇల్లు, కెరీర్‌, నన్ను, పిల్లలను చూసుకుంటూనే విద్యనభ్యసించావు. నేను సూపర్‌ విమెన్‌ను పెళ్లి చేసుకున్నా. భర్తగా ఎంత గర్వపడుతున్నానో చెప్పేందుకు నేనూ ఇంకా చదువుకోవాలనుకుంటున్నా. కంగ్రాట్స్‌ మై లవ్‌’’ అని పేర్కొన్నారు. ట్వింకిల్‌ పట్టా అందుకున్న అనంతరం ఆమెతో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు. నెటిజన్లు, పలువురు సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఈసారి అంతకు మించి.. ‘ఫ్యామిలీ మ్యాన్‌ 3’ అప్‌డేట్స్‌ ఇచ్చిన మనోజ్‌ బాజ్‌పాయ్‌

అక్షయ్‌ పోస్ట్‌పై ట్వింకిల్‌ ఖన్నా స్పందిస్తూ.. ‘‘ఇంతగా ప్రోత్సహించే భర్తను కలిగి ఉండడం నా అదృష్టం’’ అని అన్నారు. 50 ఏళ్ల ట్వింకిల్‌.. లండన్‌ విశ్వవిద్యాలయం (గోల్డ్‌స్మిత్స్‌) నుంచి ఫిక్షన్‌ రైటింగ్‌లో పట్టా పొందారు. హిందీ చిత్రం ‘బర్సాత్‌’తో 1995లో తెరంగేట్రం చేసిన ట్వింకిల్‌ తొలి ప్రయత్నంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘జాన్‌’, ‘దిల్‌ తేరా దీవానా’, ‘ఇంటర్నేషనల్‌ ఖిలాడి’ తదితర చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి మెప్పించారు. వెంకటేశ్‌ హీరోగా తెరకెక్కిన ‘శీను’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ ఒక్క సినిమాకే పరిమితమయ్యారు. వివాహానంతరం నటనకు దూరమయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని