The Family Man 3: ఈసారి అంతకు మించి.. ‘ఫ్యామిలీ మ్యాన్‌ 3’ అప్‌డేట్స్‌ ఇచ్చిన మనోజ్‌ బాజ్‌పాయ్‌

‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ సిరీస్‌ సీజన్‌ 3 షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభంకానుందో నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌ తెలిపారు. ఆ వివరాలివీ..

Published : 17 Jan 2024 18:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విశేష ప్రేక్షకాదరణ పొందిన వెబ్‌సిరీస్‌ల్లో ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ (The Family Man) ఒకటి. రెండు సీజన్లతో థ్రిల్‌ పంచిన ఈ సిరీస్‌ మూడో సీజన్‌ (The Family Man 3) కోసం ఆడియన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌ (Manoj Bajpayee) ఆ ప్రాజెక్టు గురించి పలు వివరాలు తెలియజేశారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌ 3’.. గత రెండు సీజన్లకు మించి ఉంటుందంటూ అంచనాలు పెంచేశారు.

‘ఇండియన్‌ 2’, ‘తంగలాన్‌’ ఆ ఓటీటీలోనే స్ట్రీమింగ్‌.. ఎక్కడంటే?

‘‘ఫిబ్రవరి ఆఖరి వారంలో ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 3’ చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈశాన్య భారతదేశంలో అధిక భాగం షూటింగ్‌ చేయనున్నాం. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’ ఎక్కడైతే పూర్తైందో అక్కడి నుంచే ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 3’ మొదలవుతుంది. శ్రీకాంత్‌ తివారీ (మనోజ్‌ బాజ్‌పాయ్‌ పోషించిన పాత్ర) పిల్లలు పెద్దవాళ్లు అవుతారు. ఆయనకు వయసు పెరిగినా సవాళ్లు వెంటాడుతూనే ఉంటాయి. ఈసారి వాటిని ఎలా ఎదుర్కొన్నాడనేది సిరీస్‌ చూసి తెలుసుకోవాల్సిందే ’’ అని పేర్కొన్నారు.  2025లో.. ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశాలున్నాయి.

ఈ సిరీస్‌కు రాజ్‌ అండ్‌ డీకే దర్శకులు. 2019లో సీజన్‌ 1 విడుదలై ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించింది. ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో అత్యధిక మంది వీక్షణలు సొంతం చేసుకున్న సిరీస్‌గా నిలిచింది. ప్రముఖ హీరోయిన్‌ సమంత కీలక పాత్ర పోషించిన సీజన్‌ 2.. 2021లో రిలీజై విశేషంగా ఆకట్టుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు