Alia bhatt: ఎంత కష్టపడుతున్నా అలా ఎందుకంటున్నారో..!: అలియా భట్‌

నటి అలియా భట్‌ (Alia Bhatt) తాజాగా ఓ ఇంటర్వ్యూలో నెపోటిజం గురించి మాట్లాడారు. తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన ప్రశ్నలను గుర్తు చేసుకున్నారు.

Published : 21 Sep 2023 17:48 IST

ముంబయి: చిత్ర పరిశ్రమలో నెపోటిజం ఎప్పుడూ చర్చనీయాంశమే. దీనిపై ఎంతో మంది నటీనటులు గతంలో వారి అభిప్రాయాలను వెల్లడించారు. తాజాగా బాలీవుడ్ నటి అలియా భట్‌ (Alia Bhatt) నెపోటిజం మాట్లాడారు. ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలియా గతంలో తనకు ఎదురైన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ఎంత కష్టపడుతున్నా బంధుప్రీతి ప్రస్తావన ఎందుకు తెస్తున్నారో మొదట్లో అర్థం కాలేదని అన్నారు.

కరణ్‌ జోహార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాతో అలియా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు. అయితే, తన తండ్రి దర్శకుడు అయిన కారణంగానే ఆమెకు అవకాశాలు వచ్చాయని అందరూ అనుకునే వారని అలియా చెప్పారు. ‘‘నా కెరీర్‌ ప్రారంభంలో నేను ఏ ఇంటర్వ్యూకు వెళ్లినా నెపోటిజం ప్రస్తావన వచ్చేది. మాది సినీ నేపథ్యమున్న కుటుంబం కనుక నేను ఇండస్ట్రీలో రాణించగలుగుతున్నా అని అనేవారు. ఎంత కష్టపడి పనిచేస్తున్నా అలా ఎందుకు అంటున్నారో అప్పుడు అర్థమయ్యేది కాదు. కానీ, పరిశ్రమలోకి రావడానికి చాలా మంది ఎంత కష్టపడుతున్నారో తర్వాత తెలిసింది. వారితో పోలిస్తే నేను సులభంగానే నటిని అయ్యానని అర్థమైంది’’ అని అలియా చెప్పారు. 

ఆస్కార్-2024.. అధికారిక ఎంట్రీ కోసం పోటీ పడుతున్న చిత్రాలివేనా?

ఇక తన కుటుంబం గురించి మాట్లాడుతూ.. ‘‘సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించాను కాబట్టి నాలో నటిని కావాలనే ఆసక్తి మొదటి నుంచి ఉంది. కానీ, మా నాన్న ఎప్పుడూ నన్ను దీని గురించి అడగలేదు. నిజానికి మా అమ్మ కూడా ఇండస్ట్రీలోకి వచ్చాక చాలా కష్టపడింది. ఈ విషయాలు చాలా మందికి తెలియవు. ఆమె దర్శకుడిని వివాహం చేసుకుంది కాబట్టే నటి అయిందని అంతా అనుకున్నారు’’ అని అలియా తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని