Alia Bhatt: రణ్‌బీర్‌ను ముద్దాడిన అలియా.. పోస్ట్ వైరల్‌

తన భర్త రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor)ను ఉద్దేశిస్తూ నటి అలియాభట్‌ (Alia Bhatt) ప్రత్యేకంగా పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం ఇది నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

Published : 28 Sep 2023 13:36 IST

ముంబయి: బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా రణ్‌బీర్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు ఆయన సతీమణి, నటి అలియాభట్‌ (Alia Bhatt). వివాహం నాటి ఫొటోలతో పాటు పలు సందర్భాల్లో రణ్‌బీర్‌తో కలిసి దిగిన ఫొటోలను ఆమె అభిమానులతో పంచుకున్నారు. ఇందులోని ఓ ఫొటోలో ఆమె రణ్‌బీర్‌ను ముద్దాడుతూ కనిపించారు.

‘‘నా ప్రియుడు.. బెస్ట్‌ ఫ్రెండ్‌.. నేను సంతోషంగా ఉండేచోటు.. హ్యాపీ బర్త్‌డే మై బేబీ. జీవితంలో నువ్వు మరెన్నో సాధించాలని కోరుకుంటున్నా’’ అని ఆమె పోస్ట్‌ పెట్టారు. ‘‘నా పక్కనే కూర్చొని నీ సీక్రెట్‌ అకౌంట్‌లో నేను పెట్టిన క్యాప్షన్ చదువుతున్న నీకు హ్యాపీ బర్త్‌డే’’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు. రణ్‌బీర్‌ సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటారు. దాన్నుద్దేశించి అలియా ఇలా పోస్ట్‌ పెట్టారు. మరోవైపు రష్మిక, పీవీ సింధు, నిషా అగర్వాల్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు రణ్‌బీర్‌కు విషెస్‌ చెబుతూ కామెంట్స్‌ పెడుతున్నారు.

skanda movie review: రివ్యూ స్కంద.. రామ్‌-బోయపాటి కాంబినేషన్‌ మెప్పించిందా?

అలియాభట్‌ - రణ్‌బీర్‌ కపూర్‌ చిన్నతనం నుంచి మంచి స్నేహితులు. గతేడాది విడుదలైన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా కోసం మొదటిసారి వీరిద్దరూ కలిసి వర్క్‌ చేశారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో గతేడాది ఏప్రిల్‌లో పెళ్లి చేసుకున్నారు. వీరికి రాహ అనే కుమార్తె ఉంది. సినిమాల విషయానికి వస్తే.. రణ్‌బీర్ ప్రస్తుతం ‘యానిమల్‌’ కోసం వర్క్‌ చేస్తున్నారు. సందీప్‌ రెడ్డి వంగా దర్శకుడు. రష్మిక కథానాయిక. ‘రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ’, ‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’ వంటి ప్రాజెక్ట్‌లతో ఇటీవల ప్రేక్షకులను అలరించారు అలియాభట్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని