Ashwini Dutt: ఆ సినిమా చేసి నేనూ అరవింద్‌ రూ. 12 కోట్లు నష్టపోయాం: అశ్వనీదత్‌

ఎన్టీఆర్‌ నటించిన ఓ సూపర్‌ హిట్‌ చిత్రంలో హీరోగా ముందుగా ప్రభాస్‌ని అనుకున్నామని, అది సాధపడలేదని అన్నారు ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌.

Published : 13 Aug 2022 01:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓటీటీ కంటే యూట్యూబ్‌ ప్రమాదకరమని అన్నారు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌. వైజయంతి మూవీస్‌ నెట్‌వర్క్‌పై నిర్మితమైన ‘సీతారామం’ చిత్రం ఇటీవల విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ సందర్భంగా ఆయన ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga) కార్యక్రమానికి విచ్చేసి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. తానెప్పటికీ సీనియర్‌ ఎన్టీఆర్‌ని దైవంగానే భావిస్తానన్నారు. తన తనయలు నిర్మించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా సంగతులు వివరిస్తూ నవ్వులు కురిపించారు. తాను, అల్లు అరవింద్‌.. ‘చూడాలని ఉంది’ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేశామని, దాంతో చేరో రూ. 6 కోట్లు పోగొట్టుకున్నామని తెలిపారు.

తన కెరీర్‌ ప్రారంభంలో సినిమాలను రూ.16 లక్షలతో నిర్మించానని చెప్పారు. ‘జాతిరత్నాలు’ సినిమా చూసి కడుపుబ్బా నవ్వుకున్నానన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదని తెలిపారు. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి 2’తో తన సినీ కెరీర్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టాలనుందన్నారు. అందరూ అనుకుంటున్నట్టు ఓటీటీ అనేది ప్రమాదకరం కాదని, యూట్యూబ్‌ డేంజర్‌ అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభాస్‌ హీరోగా తాను నిర్మిస్తున్న ‘ప్రాజెక్ట్‌ కె’ చిత్రం షూటింగ్‌ 50 శాతం పూర్తయిందని తెలిపారు.

‘స్టూడెంట్‌ నెం. 1’ సినిమాకి హీరోగా ప్రభాస్‌ని అనుకున్నానని, చివరకు ఎన్టీఆర్‌ నటించారని వివరించారు. ‘శక్తి’ చిత్రం విషయంలో నిరుత్సాహపడినట్టు తెలిపారు. రజనీకాంత్‌, తన భార్య చెప్పిన మాట వినకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు పేర్కొన్నారు. పూర్తి ఎపిసోడ్‌ ‘ఈటీవీ’లో ఆగస్టు 15న రాత్రి 9:30 గం.లకు ప్రసారం కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని