Singeetam Srinivasa Rao: కథ అద్భుతం అన్నారు.. నిర్మించడానికి ఎవరూ ముందుకు రాలేదు: సింగీతం శ్రీనివాసరావు

ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించి చిత్రపరిశ్రమలో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు....

Updated : 31 Aug 2022 14:11 IST

హైదరాబాద్‌: ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించి చిత్రపరిశ్రమలో గొప్ప పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa Rao). దర్శకుడిగానే కాకుండా నిర్మాత, రచయిత, నటుడిగానూ ఆయన దక్షిణాది వారికి సుపరిచితులు. ప్రస్తుతం వెండితెరకు దూరంగా ఉన్న ఆయన తాజాగా ఈటీవీలో ప్రసారమవుతోన్న ‘ఆలీతో సరదాగా’లో (Alitho Saradaga) పాల్గొన్నారు. తన కెరీర్‌ గురించి పలు ఆసక్తికర విశేషాలు బయటపెట్టారు.

‘‘శారీరకంగా నా వయసు 92.. మానసికంగా 25’’ అంటూ సంగీతం నవ్వులు పూయించారు. ‘మాయబజార్‌’కు కో డైరెక్టర్‌గా పనిచేశారా? అసోసియేట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేశారా? అని ప్రశ్నించగా.. ‘ అసిస్టెంట్‌గా అప్పుడే నా ప్రయాణం మొదలైంది.’ అని చెప్పారు. ఎన్టీఆర్‌ని కృష్ణుడిగా చూడటం ఒక అద్భుతమని అన్నారు. అనంతరం ‘పుష్పక విమానం’ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘‘కథ అద్భుతంగా ఉందని అందరూ మెచ్చుకున్నారు. కానీ, ఆ చిత్రాన్ని నిర్మించడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఎవరైనా నిర్మాత ముందుకు వస్తే బాగుండు అనుకున్నా’’ అని ఆయన వివరించారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని