Ram Charan: రామ్‌చరణ్‌ నటించాల్సింది.. అల్లు అర్జున్‌కు దక్కింది.. అదే సినిమా అంటే?

రామ్‌చరణ్‌ నటించాల్సిన సినిమా అవకాశం అల్లు అర్జున్‌కు దక్కింది. అదే సినిమా, ఎందుకంటే?

Published : 01 Feb 2023 13:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకరు నటించాల్సిన సినిమా/పాత్ర మరొకరికి దక్కడం చిత్ర పరిశ్రమలో సాధారణం. దానికి కారణాలు అనేకం. ప్రముఖ నటులు రామ్‌చరణ్‌ (Ram Charan), అల్లు అర్జున్‌ (Allu Arjun) తమ కెరీర్‌ ప్రారంభానికి ముందే ఆ అనుభవాన్ని ఎదుర్కొన్నారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘గంగోత్రి’ సినిమాతో అల్లు అర్జున్‌ హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. హీరో పాత్రలో నటింపజేసేందుకు అర్జున్‌ కంటే ముందు చరణ్‌ను సంప్రదించింది చిత్రబృందం. ‘‘చరణ్‌ నటనలో పరిణితి పొందేందుకు సమయం పడుతుంది. తను శిక్షణ పొందాలి. బన్నీ బాగుంటాడు.. తనతో చేయండి’’ అని చిరంజీవి ఆ సినిమా టీమ్‌కు సమాధానమిచ్చారట. అలా.. చరణ్‌ నటించాల్సిన సినిమా బన్నీ చేశారని, తనకు మంచి పేరొచ్చిందని నాగబాబు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

‘గంగోత్రి’ (Gangotri) 2003లో విడుదలైంది. మూడేళ్లు అనంతరం చరణ్‌ నటుడిగా మారారు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘చిరుత’ (Chirutha) చిత్రంతో ఆయన తెరంగేట్రం (2007లో) చేశారు. చరణ్‌ హీరోగా తెరకెక్కిన ‘ఎవడు’ సినిమాలో బన్నీ కనిపించిన సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు