Pushpa 2: ‘పుష్ప 2’ డైలాగ్‌ లీక్‌ చేసిన అల్లు అర్జున్‌.. వీడియో వైరల్‌

అల్లు అర్జున్‌ హీరోగా దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప 2’. ఈ సినిమాలోని డైలాగ్‌ని హీరో లీక్‌ చేశారు.

Published : 21 Jul 2023 02:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాలోని ఓ డైలాగ్‌ని అల్లు అర్జున్‌ (Allu Arjun) లీక్‌ చేశారు. ‘బేబీ’ (Baby) సినిమా ఈవెంట్‌లో ఆ సంభాషణ చెప్పి అలరించారు. సినిమాపై అంచనాలు పెంచారు. ఆనంద్‌ దేవరకొండ (Anand Deverakonda) హీరోగా దర్శకుడు సాయి రాజేశ్‌ తెరకెక్కించిన ‘బేబీ’ ఇటీవల విడుదలై, విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్‌లో అప్రిసియేషన్‌ మీట్‌ నిర్వహించింది. దానికి అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా హాజరై, సందడి చేశారు. ‘బేబీ’ సినిమా బాగా నచ్చిందన్న ఆయన.. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రసంగం ముగుస్తుండగా ‘పుష్ప 2’లోని డైలాగ్‌కావాలని అభిమానులు కోరారు. బన్నీ చెప్పిన డైలాగ్‌ కొన్ని క్షణాల్లోనే నెట్టింట వైరల్‌గా మారింది.

ఆ విషయంలో చాలా బాధపడ్డా.. మీరు ధైర్యంగా రండి: అల్లు అర్జున్‌

2021లో విడుదలై సూపర్‌హిట్‌ అందుకున్న ‘పుష్ప: ది రైజ్‌’కి కొనసాగింపుగా తెరకెక్కుతున్నదే ‘పుష్ప: ది రూల్‌’ (పుష్ప 2). సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక కథానాయిక. పార్ట్‌ 1లో ప్రముఖ నటుడు ఫహాద్ ఫాజిల్‌ (Fahadh Faasil) ఎస్పీ భన్వ‌ర్‌ సింగ్ షెకావ‌త్‌గా కనిపించిన సంగతి తెలిసిందే. ‘‘పుష్ప రెండో భాగంలో భన్వర్‌ సింగ్‌ పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది. హీరోకు, ఆ పాత్రకు మధ్య చాలా యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయి. పార్ట్‌ 2 ఎక్కువగా సంఘర్షణల మధ్య తిరుగుతుంటుంది’’ ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పి, అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించారు. ఇంకెందుకు ఆలస్యం ‘పుష్ప 2’ పవర్‌ఫుల్‌ డైలాగ్‌ మీరూ వినేయండి..  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని