Pushpa: ‘పుష్ప’ హిందీ వర్షెన్‌లో అల్లుఅర్జున్‌కి వాయిస్‌ ఇచ్చింది ఈ నటుడే!

టాలీవుడ్‌ కథానాయకుడు అల్లు అర్జున్‌ తొలిసారి నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’.  యావత్‌ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం.. డిసెంబర్‌ 17న  తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ  భాషల్లో థియేటర్లలో విడుదలకానుంది.

Updated : 09 Dec 2021 16:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ కథానాయకుడు అల్లు అర్జున్‌ తొలిసారి నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’.   డిసెంబర్‌ 17న  తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో  విడుదలకానుంది. దక్షిణాదితో పాటు ఉత్తరాదిన అల్లు అర్జున్‌కి మంచి క్రేజ్‌ ఉంది. ఇటీవలే హిందీలో విడుదలైన పుష్ప ట్రైలర్‌కి చక్కటి ఆదరణ లభించింది. అందులో హిందీ డబ్బింగ్‌ వాయిస్‌ అల్లుఅర్జున్‌ది కాకపోవడంతో ఈ వాయిస్‌ ఎవరిదై ఉంటుందా అని వెతకడం మొదలు పెట్టారు ఆయన అభిమానులు.  ఓం శాంతి ఓంలో నటించిన శ్రేయాస్‌ తల్పడే గాత్రం అందించారు. ఇదే విషయాన్ని ఆయన అభిమానులతో పంచుకున్నారు. ‘‘ భారతదేశపు పవర్‌ఫుల్‌, స్టైలిష్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ నటించిన  ‘పుష్ప’ హిందీ వర్షెన్‌కు వాయిస్‌ ఇచ్చా. చాలా గర్వంగా, సంతోషంగా ఉంది’’ అంటూ ట్వీట్‌ చేశారు. నటుడిగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగా పేరొందారు శ్రేయాస్‌ తల్పడే. గోల్‌మాల్‌ రిటర్న్స్‌, గోల్‌మాల్‌ 3, హౌస్‌ఫుల్‌ 2, గోల్‌మాల్‌ అగైన్‌ వంటి  హిందీ చిత్రాలతో పాటు పలు మరాఠీ చిత్రాల్లోనూ నటించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని