Kalki: ‘కల్కి’లో తన పోస్టర్‌పై అమితాబ్‌ పోస్ట్‌..

‘కల్కి’లో తన పోస్టర్‌ను అమితాబ్‌ సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. మంచి పాత్రను ఇచ్చినందుకు చిత్రబృందానికి ధన్యవాదాలు తెలిపారు.

Published : 13 Oct 2023 13:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాగ్‌ అశ్విన్‌ - ప్రభాస్‌ల కాంబోలో రానున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఈ సినిమాలో బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన పుట్టిన రోజు సందర్భంగా ‘కల్కి’ చిత్రబృందం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. తాజాగా దీనిపై అమితాబ్‌ తన సోషల్‌మీడియాలో పోస్ట్‌ పెట్టారు. అలాగే తన బ్లాగ్‌లోనూ ఈ పోస్టర్‌ను షేర్‌ చేశారు.

తనకు శుభాకాంక్షలు చెప్పినందు ‘కల్కి’ నిర్మాణ సంస్థకు కృతజ్ఞతలు తెలిపిన అమితాబ్‌.. ఈ సినిమాలోని పాత్ర ఎంతో సవాళ్లతో కూడుకున్నదని అన్నారు. అలాంటి పాత్రను ఇచ్చినందుకు చిత్రబృందానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే, తన బ్లాగ్‌లో ఈ పోస్టర్‌ను షేర్‌ చేసి.. ‘సినిమా రంగంలో ఎన్నో ఒడుదొడుకులు ఉంటాయి. ఆలోచనలకు, ఊహలకు రూపాన్ని ఇచ్చి అద్భుతాలను చేస్తారు. ఈ రంగం ఒక విశ్వంతో సమానం. ఎంతో మంది సమష్టి కృషి’ అని రాసుకొచ్చారు. ఇక ‘కల్కి’ గ్లింప్స్‌లోనూ అమితాబ్‌ కనిపించి ఆకట్టుకున్నారు. శరవేగంగా జరుగుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ప్రభాస్ (Prabhas) సరసన దీపిక పదుకొణె (Deepika Padukone) నటిస్తుండగా.. సీనియర్‌ హీరో కమల్‌ హాసన్‌ విలన్‌ పాత్రలో కనిపించనున్నారు. అలాగే దుల్కర్‌ సల్మాన్‌, పశుపతి, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

రివ్యూ: ‘గాడ్‌’.. క్రైమ్‌ థ్రిల్లర్‌ మెప్పించిందా?

ఇక అమితాబ్‌ ప్రస్తుతం టి.జి. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటిస్తోన్న  ‘తలైవా 170’ (Thalaivar 170)లోనూ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని చిత్రయూనిట్‌ ప్రకటించి.. అమితాబ్‌ పోస్టర్‌ను విడుదల చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని