Amitabh Bachchan: ‘ప్రాజెక్ట్ కె’ షూట్.. అమితాబ్‌కు గాయం
అగ్ర కథానాయకుడు అమితాబ్ బచ్చన్ (Amitabh) గాయపడ్డారు. ప్రాజెక్ట్ కె (Project K) షూట్‌లో ఆయనకు ప్రమాదం జరిగింది.
ముంబయి: బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ (Amitab Bachchan) గాయపడ్డారు. ‘ప్రాజెక్ట్ కె’ (Project K) షూట్‌లో ఆయనకు దెబ్బలు తగిలాయి. ఈ విషయాన్ని తన బ్లాగ్ వేదికగా బిగ్‌బీ తెలియజేశారు. గాయం కారణంగా తాను పాల్గొనాల్సిన షూట్స్ అన్నింటినీ వాయిదా వేసుకున్నట్లు చెప్పారు. ఈ వీకెండ్‌లో అభిమానులను కలవలేకపోతున్నానని వెల్లడించారు.
‘‘ప్రాజెక్ట్ కె’ (Project K) షూట్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన షెడ్యూల్‌లో నేను గాయపడ్డాను. యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు కుడివైపు పక్కటెముకలకు దెబ్బ తగిలింది. షూట్ రద్దు చేసుకుని వైద్యులను సంప్రదించాను. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో తగిన చికిత్స తీసుకున్నాను. ఊపిరి తీసుకుంటున్నప్పుడు ఇబ్బందిగా ఉండటంతో వైద్యులు కొన్ని వారాల పాటు విశ్రాంతి సూచించారు. అందువల్ల పనులన్నింటినీ కొంతకాలంపాటు వాయిదా వేసి.. ముంబయిలోని ‘జల్సా’ (నివాసం)లో రెస్ట్ తీసుకుంటున్నాను. ఈరోజు సాయంత్రం అభిమానులను కలవలేకపోతున్నా’’ అని వెల్లడించారు.
ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కె’ సిద్ధమవుతోంది. దీపికా పదుకొణె కథానాయిక. యాక్షన్ అడ్వెంచర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈసినిమాలో అమితాబ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూట్ చాలా వరకూ పూర్తైంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News: దిల్లీలో దారుణం.. నడిరోడ్డుపై 16 ఏళ్ల బాలికను కత్తితో పొడిచి హత్య..!
-
Sports News
Ambati Rayudu: ఈ గుంటూరు కుర్రాడికి ఘాటెక్కువే..!
-
Movies News
Kamal Haasan: ఆ రోజు వాళ్లెవ్వరూ నా మాటలు పట్టించుకోలేదు: కమల్ హాసన్
-
Sports News
Sunil Gavaskar: ఆ విషయంలో అతడు ధోనీని గుర్తు చేస్తాడు : హార్దిక్ పాండ్యపై గావస్కర్ ప్రశంసలు
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Canada: కెనడాలో ఓ పెళ్లివేడుకలో పంజాబీ గ్యాంగ్‌స్టర్ హత్య..!