Anand deverakonda: ఆ సీన్స్‌ చూసి నా హృదయం బరువెక్కింది: ఆనంద్ దేవరకొండ

తాజాగా విడుదలైన ఓ ప్రేమకథా చిత్రాన్ని ఉద్దేశించి నటుడు ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమా చూసి తాను భావోద్వేగానికి గురయ్యానన్నారు.

Published : 18 Nov 2023 13:44 IST

ఇంటర్నెట్‌డెస్క్: రక్షిత్ శెట్టి (Rakshit shetty), రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) ప్రధాన పాత్రల్లో నటించిన ఫీల్‌గుడ్ ప్రేమ కథా చిత్రం ‘సప్తసాగరాలు దాటి సైడ్‌ బి’ (Sapta Sagaralu Dhaati Side-B). హేమంత్ ఎం రావు దర్శకుడు. ‘సప్తసాగరాలు దాటి సైడ్‌ ఎ’కు సీక్వెల్‌గా ఇది సిద్ధమైన విషయం తెలిసిందే. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు నటుడు ఆనంద్‌ దేవరకొండ (Anand Deverakonda). ఫిల్మ్‌ మేకింగ్‌లో దర్శకుడి ప్రతిభను ఆయన మెచ్చుకున్నారు.

‘‘కొన్ని సన్నివేశాలు చూసి హృదయం బరువెక్కింది. మరికొన్ని సీన్స్‌ భావోద్వేగానికి గురి చేశాయి. ఈ సినిమా చూస్తున్నంతసేపు మీరు మరో ప్రపంచంలోకి వెళ్తారు. ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు ఓ అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. క్లాసిక్‌ ఫిల్మ్‌. ఫిల్మ్‌ మేకింగ్ అత్యద్భుతం. అలాగే రెండుచిత్రాల్లోనూ మ్యూజిక్‌ చాలా బాగుంది’’ అని ఆనంద్‌ దేవరకొండ అన్నారు.

‘ఉయ్యాలో ఉయ్యాలా..’ ఫుల్‌ వీడియో వచ్చేసింది..!

కథేంటంటే: ప్రేమించుకుని... ఆ ప్రేమ‌ని నిల‌బెట్టుకునేందుకు శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నించి చివ‌రికి విధి ముందు ఓడిపోతుంది మ‌ను, ప్రియ జంట‌. ప్రియకు పెళ్ల‌వుతుంది. మ‌ను జైలులోనే జీవితాన్ని గ‌డ‌పాల్సి వ‌స్తుంది. ఇదంతా తొలి భాగం క‌థే. ప‌దేళ్ల శిక్ష త‌ర్వాత 2021లో మ‌ను (ర‌క్షిత్ శెట్టి) జైలు నుంచి తిరిగి రావ‌డంతో రెండో భాగం క‌థ మొద‌ల‌వుతుంది. బ‌య‌టికి రాగానే ప్రియ (రుక్మిణీ వ‌సంత్‌) చిరునామా తెలుసుకోవాల‌నుకుంటాడు. అందుకోసం సుర‌భి (చైత్ర జె.ఆచార్‌) సాయం తీసుకుంటాడు. మ‌రి ప్రియ‌ని మ‌ను క‌లిశాడా లేదా?ప‌దేళ్ల త‌ర్వాత ఆమె జీవితంలో ఎలాంటి మార్పు వ‌చ్చింది?ఇంత‌కీ సుర‌భి ఎవ‌రు?త‌ను జైలులో మ‌గ్గిపోవ‌డానికి కార‌ణమైన వాళ్ల‌పై మ‌ను ప్ర‌తీకారం ఎలా తీర్చుకున్నాడు? వంటి అంశాలతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని