
Updated : 05 Dec 2021 12:36 IST
Anasuya: యాంకర్ అనసూయ ఇంట విషాదం!
హైదరాబాద్: ప్రముఖ యాంకర్, నటి అనసూయకు పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి సుదర్శన్ రావు(63) ఆదివారం ఉదయం హైదరాబాద్లోని తార్నాకలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన క్యాన్సర్తో పోరాడుతున్నారు. పరిస్థితి విషమించి ఇవాళ తుదిశ్వాస విడిచారు. సుదర్శన్ రావు కాంగ్రెస్ పార్టీలో చాలాకాలం పాటు పనిచేశారు. రాజీవ్ గాంధీ హయాంలో యూత్ కాంగ్రెస్ పబ్లిసిటీ సెక్రటరీగా వ్యవహరించారు. ఆయన మృతితో అనసూయ ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి.
ఇవీ చదవండి
Tags :