Anil Kapoor: జూనియర్‌ అనిల్‌ కపూర్‌కు నెటిజన్లు ఫిదా.. అతనెవరంటే?

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అనిల్‌ కపూర్‌ను పోలిన ఓ వ్యక్తి నెట్టింట ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాడు. తన రూపంతో అందరినీ థ్రిల్‌ చేస్తున్నాడు.

Published : 21 Sep 2022 02:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అనిల్‌ కపూర్‌ (Anil Kapoor)ను పోలిన ఓ వ్యక్తి నెట్టింట ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాడు. జూనియర్‌ అనిల్‌ కపూర్‌లా అందరినీ థ్రిల్‌ చేస్తున్నాడు. అతని పేరు జాన్‌ ఎఫర్‌ (John Effer). అమెరికాకు చెందిన ఆయన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. తన వ్యాయామానికి సంబంధించిన వీడియోలను జాన్‌ తరచూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటాడు. సుమారు 90 వేల మంది ఫాలోవర్స్‌ ఉన్న జాన్‌ ఇటీవల తన ఫొటోని, అనిల్‌ కపూర్‌ ఫొటోని ఒకే ఫ్రేమ్‌లో సెట్‌ చేసి, దాన్ని షేర్‌ చేశాడు. అనిల్‌ కపూర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను ట్యాగ్‌ చేశాడు. బాలీవుడ్‌ పిలుపు కోసం ఎదురుచూస్తున్నానంటూ జాన్‌ తన మనసులో మాట బయటపెట్టాడు. ఆ ఇద్దరూ ఒకేలా కనిపించడంతో ఆశ్చర్యపోతున్నారు. అనిల్‌ కపూర్‌ సినిమాల విషయానికొస్తే.. ‘జుగ్‌ జుగ్‌ జియో’ అనే చిత్రంతో ఇటీవల ప్రేక్షకులను పలకరించారు. రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న‘యానిమల్‌’లో కీలక పాత్ర పోషిస్తున్నారు.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని