Anupama: సినిమాటోగ్రాఫర్‌గా మారిన అనుపమ.. ఏ చిత్రానికంటే?

యంగ్‌ హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ తనలోని కొత్త కోణాన్ని పరిచయం చేసింది. ఓ ప్రాజెక్టుకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించింది. 

Published : 10 Apr 2023 23:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్: దక్షిణాది భాషలన్నింటిలో వైవిధ్యభరిత పాత్రలు ఎంపిక చేసుకుంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నటి అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran). ఆమెలో సినిమాటోగ్రఫీ కళ కూడా దాగి ఉంది. సంకల్ప్‌ గోరా దర్శకత్వం వహించిన ‘ఐ మిస్‌ యు’ (I Miss You) అనే లఘు చిత్రానికి రితిగుప్తతో కలిసి అనుపమ డీఓపీ బాధ్యత తీసుకుంది. యూట్యూబ్‌ వేదికగా సోమవారం విడుదలైన ఆ షార్ట్‌ఫిల్మ్‌ చూసిన వారంతా కెమెరా వర్క్‌ బాగుందంటూ కామెంట్లు పెడుతున్నారు. అనుపమ హీరోయిన్‌గా రాణిస్తూనే సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయడం విశేషం. ఇటీవల.. ‘కార్తికేయ 2’, ‘18 పేజెస్‌’, ‘బటర్‌ ఫ్లై’ తదితర చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన అనుపమ ప్రస్తుతం తమిళ్‌లో ఓ సినిమా, మలయాళంలో ఓ సినిమాలో నటిస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని