Samantha: సమంత మోటివేషనల్ పోస్ట్.. అనుష్క శర్మ రిప్లై
సమంత (Samantha) షేర్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం వైరలవుతోంది. దానికి అనుష్క శర్మ ఇచ్చిన రిప్లై ఆకట్టుకుంటోంది.
హైదరాబాద్: టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత (Samantha) షేర్ చేసిన పోస్ట్‌కు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ (Anushka Sharma) రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం మయోసైటిస్ నుంచి కోలుకుంటున్న సమంత సోషల్‌మీడియాలో యాక్టివ్ అయింది. గత కొన్ని రోజులుగా ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ వారిలో జోష్ నింపుతోంది. ఇక ఆదివారం ఓ మోటివేషనల్ పోస్ట్ పెట్టి సామ్ అందరినీ ఆకర్షించింది.
పూజ చేస్తున్న ఫొటో షేర్ చేస్తూ.. ‘‘కొన్నిటిని ఎదుర్కోవడానికి మన బలం సరిపోదు. మనపై మనకున్న నమ్మకం మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది. మనల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. ఆ నమ్మకమే మన గురువుగా, స్నేహితుడిగా మారుతుంది. అది మనల్ని మానవాతీత శక్తిగా నిలబెడుతుంది’’ అని రాసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరలవుతోంది. షేర్ చేసిన కొన్ని గంటలకే 14 లక్షలమంది లైక్ చేశారు. ఇక పోస్ట్‌పై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ స్పందించింది. ‘నేను దీనిని పూర్తిగా అంగీకరిస్తున్నాను’ అంటూ హార్ట్ ఎమోజీని కామెంట్ చేసింది. ఇక మరోవైపు సమంత సినిమాలతో, వెబ్ సిరీస్‌లతో తీరిక లేకుండా గడుపుతోంది. ప్రస్తుతం సామ్ ‘శాకుంతలం’ (Shaakuntalam) సినిమా విడుదలకోసం ఎదరుచూస్తోంది. ఇప్పటికే ట్రైలర్, పాటలకు మంచి ప్రేక్షకాదరణ లభించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. దీనితో పాటు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో కలిసి ‘ఖుషి’ (Kushi)లో నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్‌లో సమంత పాల్గొంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ లవ్ ఎంటర్‌టైనర్ ఈ ఏడాది ప్రేక్షకులను అలరించనుంది. వీటితో పాటు భారీ యాక్షన్ సన్నివేశాలతో రానున్న ‘సిటాడెల్’ (Citadel) తోనూ బిజీగా ఉంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
వాహ్.. బేటా!.. తాజ్ చూపించి తల్లి కోరిక తీర్చిన తనయుడు
-
Ts-top-news News
తూచింది 51 కేజీలు.. వచ్చింది 27 కేజీలు.. ఆర్టీసీ కార్గో నిర్వాకం
-
Crime News
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి
-
India News
Kejriwal: దిల్లీని గెలవాలనుకుంటే..! మోదీకి కేజ్రీవాల్ ఇచ్చిన సలహా
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (22/03/2023)
-
Sports News
భిన్నమైన మేళవింపులు ప్రయత్నిస్తున్నాం.. కోచ్ రాహుల్ ద్రవిడ్